చైనా దృష్టిలో పాకిస్తాన్ అంత చీపా..!  పాకిస్తాన్‌ను ఇంత నీచంగా చూస్తుందా..? అంటే తాజాగా వెలుగుచూసిన ఓ ఘ‌ట‌న మాత్రం ఔన‌నే అంటోంది. ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. చైనాలోని వుహాన్‌న‌గ‌రంకేంద్రంగా పుట్టిన ఈ వైర‌స్ చూస్తుండ‌గానే అన్నిదేశాల‌నూ చుట్టేసింది. పాకిస్తాన్‌లో కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆ దేశ ప్ర‌జ‌లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాలు తీర్చేలేక‌పోతోంది. ఇక క‌రోనా బాధితుల‌కు క‌నీస వైద్య‌సేవలు అందించ‌లేని స్థితిలో అక్క‌డి ప్ర‌భుత్వం ఉంది. ఈ నేప‌థ్యంలోనే త‌మ‌కు ఆర్థిక సాయం అందించాలంటూ ఇప్ప‌టికే పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఇక ప‌క్క‌నే ఉన్న చైనా.. పాకిస్తాన్‌కు అవ‌స‌ర‌మైన మాస్క్‌ల‌ను పంపించింది. ఇంకా అవ‌స‌ర‌మైన సాయం అందిస్తామ‌ని చైనా పాకిస్తాన్‌కు హామీ కూడా ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే క‌రోనాను చైనీస్‌వైర‌స్ అంటూ వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను ఇమ్రాన్ త‌ప్పుబ‌ట్టారు.

 

అయితే.. తాజాగా.. మాస్క్‌ల విష‌యంలో చైనా మోస‌పూరిత‌నం బ‌య‌ట‌ప‌డింది. చిరకాల మిత్రదేశంగా భావించే పాకిస్తాన్‌ను కూడా చైనా మోసపుచ్చింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో టెస్టింగ్‌ కిట్‌లు, నాణ్యమైన ఎన్‌-95 మాస్క్‌లు అందిస్తామని ఆ దేశానికి హామీ ఇచ్చిన చైనా.. చివరకు అండర్‌వేర్లతో తయారుచేసిన మాస్క్‌లను పంపించి త‌న బుద్ధినిచూపించుకుంది. అయితే.. ఈ విష‌యంలో పాకిస్తాన్ మీడియా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. చైనా తమను మోసం చేసిందని మండిప‌డింది. సింధ్‌ రాష్ట్ర అధికారులు వాటిని తనిఖీ చేయకుండానే కరాచీలోని దవాఖానకు తరలించినట్లు ఆ మీడియా తెలిపింది. మొత్తంగా చైనా 2 లక్షల సాధారణ మాస్క్‌లు,  2 వేల ఎన్‌-95 మాస్క్‌లు, 5 వేలవెంటిలేటర్లు, 2 వేలు టెస్టింగ్‌ కిట్‌లు, 2 వేలు ప్రొటెక్టివ్‌ దుస్తులను పాక్‌కు పంపింది. ఇందులోనే అండ‌ర్‌వేర్ల‌తో త‌యారు చేసిన మాస్క్‌లు ఉండ‌డం తీవ్ర‌చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఇక దీనిపై డ్రాగ‌న్‌కంట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: