అమెరికాలో ఏదైతే జరగకూడదని ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు భావించారో  ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా ఇప్పటివరకు ప్రజల జీవితాలతో ఎలా ఆడుతుందో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభావం వన్యప్రాణులపై చూపించడానికి సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.  వన్యప్రాణులకు పెంపుడు జంతువులకు ఈ వైరస్ సోకితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పడానికే  ఆందోళనగా , భయంకరంగా ఉందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి  న్యూయార్క్ నగరం ఎదుర్కుంటోంది..

IHG

న్యూయార్క్ జూలో ఉండే ఓ పెద్ద పులికి కరోనా వైరస్ సోకింది. అమెరికా జూలో కరోన  సోకిన పులి ఈ వైరస్ బారిన పడి  కొట్టుమిట్టాడుతోంది. అమెరికా ఆర్ధిక రాజధానిగా చెప్పుకునే న్యూయార్క్ లో  బ్రాంక్  జూలో ఈ కరోనా  సోకిన పులి ఉంది. కరోనా  మనుషుల పై తీవ్రమైన ప్రభావం చూపుతున్న క్రమంలో వన్యప్రాణి పై ప్రభావం చూపించటం ఇదే మొదటిసారి కాగా ఈ విషయంపై శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

IHG

కొన్ని రోజుల క్రితమే  ఈ పెద్ద పులి మరో మూడు ఆఫ్రికన్ సింహాలు అనారోగ్యానికి గురై తీవ్రమైన దగ్గు తో ఇబ్బంది పడ్డాయి ఈ క్రమంలోనే వాటికి వైద్య పరీక్షలు చేయగా పెద్ద పులికి కరోనా పాజిటివ్ అని తేలింది. మిగిలిన వాటి రిపోర్ట్స్ ఇంకా తెలియరాలేదు. ఈ విషయాన్ని జూ వెటర్నరీ డాక్టర్ పాల్ ప్రకటించారు. ప్రభుత్వం కూడా ఈ విషయం వాస్తవం అని మీడియాకు తెలిపింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చే ప్రజల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందని తెలిపారు వెటర్నరీ అధికారులు.

IHG

కొద్దిరోజుల క్రితమే జూ మూసివేసినా కరోనా ఎలా జంతువులకి సోకిందో తెలియడంలేదని ఇదే విషయంపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.  అయితే ఈ కరోనా వైరస్ జంతువుల నుంచి వన్యప్రాణులకు సంక్రమించే పరిస్థితి ఉదృతం అయితే దాని పరిణామాలు అత్యంత తీవ్రంగా భయానకంగా ఉంటాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: