భారతదేశాన్ని కరోనా  వైరస్ కుదిపేస్తోంది. అన్ని రకాలుగా నష్టాల పాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రాణనష్టం ఆర్ధిక నష్టం ఇలా అన్ని రకాలుగా దేశాన్ని నష్టాల ఊబిలోకి నెడుతున్నది  కరోనా  వైరస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడి కరోనా వైరస్ ను  తరిమికొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ... కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నప్పటికీ... కొన్ని పొరపాట్లు కొంతమంది నిర్లక్ష్యం కారణంగా దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇక కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు చేపడుతున్నాయి. కరోనా  వైరస్ వ్యాప్తికి కారకులైన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. 

 

 

 ఇక తమ తమ రాష్ట్రాలను పూర్తిగా నిర్బంధంలోకి తీసుకుని కరోనా  వైరస్ పై  పోరాటంలో భాగంగా విజయం సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు ప్రపంచ దేశాలు. కంటికి కనిపించే శత్రువుతో పోరాటం చేయడం సులభమే... కానీ ప్రస్తుతం దేశం మొత్తం కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది. ఇక ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్ర పరిధిలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి . ఈ క్రమంలోనే కరోనా వైరస్ పై పోరాడి విజయం సాధించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో... ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల దృష్ట్యా... కేంద్ర సైనిక పారామిలిటరీ బలగాలు, ఎన్సిసి కేడెట్లను  రంగంలోకి దించినట్లు ఉత్తరాఖండ్ సర్కార్ వెల్లడించింది. 

 

 

 ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్పల్  కుమార్ సింగ్ సైనిక అధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత దేశంలో శరవేగంగా విస్తరిస్తూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు ఇంకా ఎంతోమంది మృత్యువుతో పోరాడేలా  చేస్తున్న కరోనా  వైరస్ ను  జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రజలు అప్రమత్తంగా ఉండేలా... అంతే కాకుండా బాధ్యతగా వ్యవహరించేలా చేసేందుకు వీలుగా సైనికులు,  పారామిలటరీ బలగాలను రంగంలోకి దించినట్లు ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తికి కారకులైన వారిపై కఠిన తప్పవు  అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: