తెలంగాణ‌లో కరోనా కల్లోలం ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం ఒక్క‌రోజే కొత్త‌గా 62 పాజిటివ్‌ కేసులు న మోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 334కు చేరుకుంది. అందులో 297 మంది ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారు, వారి కుటుంబీకులే కావడం గమనార్హం. అంటే మొత్తం కేసుల్లో 89 శాతం మంది ఏకంగా ఢిల్లీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో మ‌హారాష్ట్ర ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది.  మ‌హారాష్ట్ర త‌ర్వాత త‌మిళ‌నాడు, ఢిల్లీలు నిలిచాయి. 334 కేసుల‌తో తెలంగాణ దేశ‌లంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. మ‌రో ప‌క్క తెలంగాణ‌లోని సగానికి పైగా కేసులు ఒక్క హైద రాబాద్‌లోనే న‌మోద‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.  క‌రోనా వైర‌స్ బారిన ప‌డి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 11మంది మ‌ర‌ణించ‌గా, 33 మంది ద‌వాఖాన‌ల నుంచి డిశ్చార్జి అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: