ప్రపంచ మహమ్మారి అయిన కరోనా  వైరస్ ను  నాశనం చేసేందుకు ఇప్పటి వరకు విరుగుడు మందు అందుబాటులో లేదు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి ఎన్నో నెలలు గడుస్తున్నప్పటికీ దీనికి వ్యాక్సిన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మహా మహా శాస్త్రవేత్తలు సైతం ఈ వైరస్కు మందు కనిపెట్టేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం రావడం లేదు. వెరసి రోజురోజుకు ప్రజల్లో ప్రాణభయం పెరిగిపోతోంది. ఈ వైరస్ కు  మందు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో... ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వైరస్ మందు గురించి అన్ని దేశాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. 

 

 

 ఇదిలా ఉంటే కరోనా  వైరస్ ను  అంతం చేసేందుకు భారత్ లో ఓ మందు ఉంది అంటూ గతంలో భారత వైద్య పరిశోధన మండలి తెలిపిన విషయం తెలిసిందే. మలేరియా వ్యాధికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే మందు ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ను  సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అంటూ భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. ఇక ఈ విషయం తెలియగానే ప్రజలందరూ పెద్దఎత్తున మెడికల్ షాపులకు క్యూ కట్టారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే మందును భారీ మొత్తంలో కొనుగోలు చేశారు. అయితే ఈ మందును ఎంత మోతాదులో వాడాలో తెలియక ఎక్కువ మోతాదులో తీసుకుని చాలా మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం ఈ  మందును బ్యాన్ చేసింది. 

 

 

 ఇక ఈ విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకు వెళ్లడంతో... ఎలాగో  భారత ప్రభుత్వం ఆ మందును బ్యాన్ చేసింది కదా అమెరికాకు దిగుమతి చేసుకుంటే సరిపోతుంది  అనుకున్నాడో ఏమో. వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ఫోన్ చేసి కరోనా  వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును అమెరికాకు ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు. అయితే భారతదేశం మొత్తం పూర్తిగా నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో... ఎగుమతి దిగుమతులు సహా అమ్మకాలపై కూడా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో అమెరికా అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: