ప్రపంచ దేశాలను ప్రాణభయంతో చిగురుటాకులా వణికిస్తున్న  మహమ్మారి కరోనా వైరస్ భారతదేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలందరిలో  కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వైరస్ ను  ప్రపంచ మహమ్మారిగా గుర్తించడం ఈ వైరస్ కు  సరైన మందు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు మరింతగా భయాందోళనకు గురవుతున్నారు. అయితే  ఇప్పటివరకు మనుషుల నుంచి మనుషులకు సంక్రమించిన కరోనా  వైరస్ జంతువుల వరకు మాత్రం ఇప్పటి వరకు వెళ్ళలేదు. చాలామంది పెంపుడు జంతువులను పెంచుకుంటున్నప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించడం కారణంగా కరోనా వైరస్ జంతువులకు ఇప్పటివరకు సోకలేదు. 

 

 

 కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తొలిసారి నాలుగేళ్ల పులికి ప్రబలింది. అమెరికాలోని న్యూయార్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ ఫెడరల్ అధికారులు నాలుగేళ్ల పులికి కరోనా  వైరస్ సోకిన విషయాన్ని వెల్లడించారు. జూ లో ఉన్న పులికి ఓ వ్యక్తి కారణంగా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు  తెలిపారు. నగరంలో బ్రోన్స్  జూలో నాలుగేళ్ల పులి నదియాకు జూ పార్క్ లో ఓ  ఉద్యోగి రోజు ఆహారం వేస్తూ ఉండే వాడు. అతనికి కరోనా  వైరస్ సోకింది ఇక అతని  కారణంగానే పులి కూడా కరోనా  వైరస్ సోకిన తెలుస్తోంది. అయితే ఇదే జూ లో ఉన్న ఆరు పులులు సింహాలు కూడా అనారోగ్యానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. 

 

 

 ప్రస్తుతం కరోనా  వైరస్ బారిన పడిన నాలుగేళ్ల పులి నదియా  క్రమ క్రమంగా కోలుకుంటోందని  అధికారులు వెల్లడించారు. ఇక ఏకంగా పులికి కరోనా  వైరస్ తో  అప్రమత్తం అయిపోయిన అధికారులు... గతనెల 16న జూ మూసివేస్తూ  నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం మనుషులకు మాత్రమే కనిపించిన కరోనా  వైరస్ ప్రభావం ఇప్పుడు జంతువుల వరకు వెళ్లడంతో కొత్త సమస్య తలెత్తినట్లు అయింది అంటూ చెప్పుకొచ్చారు అధికారులు . ప్రస్తుతం కరోనా  వైరస్ బారిన పడిన ఆ పులికి  ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: