దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో  ఏపీని కేంద్రం ప్ర‌భుత్వం మరోసారి హెచ్చరించింది. ముఖ్యంగా విశాఖపట్నం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైర‌స్ వేగంగా విస్త‌రిస్తుండ‌టంతో  అధికారులు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచింది. దేశవ్యాప్తంగా 96 జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన కేంద్రం.. ఏపీ నుంచి ఏడు జిల్లాలను, తెలంగాణ నుంచి మూడు జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన విష‌యం తెలిసిందే. తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను రెడ్ జోన్‌గా ప్రకటించింది.మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్య వ‌ర్గాల స్ప‌ష్టం చేశాయి. 

 

దీంతో త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధులు తిరిగి వ‌చ్చిన రైళ్లు, తిరిగిన చోట్లపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించింది. వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబ సభ్యులను, కలిసిన వాళ్లను క్వారంటైన్ చేయాలని  ఆదేశించింది. ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఆదివారం రాత్రి ముఖ్య‌మంత్రి జ‌గన్మోహ‌న్‌రెడ్డికి ప్ర‌ధాన మంత్రి మోదీ స్వ‌యంగా ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో న‌మోదవుతున్న కేసుల‌పై ఆరాతీశారు.రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడానికి గల కారణాలను.. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను  ప్రధానికి సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వివరించారు. 

 

ఈ సందర్భంలో అప్రమత్తంగా ఉండాలని జగన్‌కు ప్రధాని సూచించారు.అదే స‌మ‌యంలో రాష్ట్ర‌ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని  వైఎస్‌ జగన్‌ ప్రధానికి తెలిపారు. కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై ఇటీవలే లేఖ రాశానని గుర్తుచేశారు.  ప్రధాని కూడా సానుకూ లంగా స్పందిస్తూ.. లేఖలోని అంశాలు తన దృష్టికి వచ్చాయని.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండ‌గా  సీఎం జగన్మోహ‌న్‌రెడ్డి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: