దేశంలో కరోనాని అరికట్టేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు దేశంలో 3500 మందికి కరోనా భారిన పడ్డారు.  లాక్ డౌన్ సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఎన్నో రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది.  తాజాగా న్యూఢిల్లీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన తరువాత ఇప్పటివరకూ 24 మంది డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ స్టాఫ్ తదితర హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా వైరస్ సోకడంతో తీవ్ర కలకలం రేగుతోంది.  ట్విస్ట్ ఏంటేంటే.. వీరిలో ఇద్దరు  విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు ఉండగా, వీరిద్దరూ రెండు మొహల్లా క్లినిక్స్ లో పని చేశారు.

 

సఫ్దర్ గంజ్ ఆసుపత్రిలో పని చేస్తున్న మరో డాక్టర్ కు తాను చికిత్స చేసిన రోగి నుంచి కరోనా సోకింది.   మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో 20 రోజుల క్రితం చేరిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో, ఆసుపత్రిలో పని చేస్తున్న 81 మందిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. వీరిలో ఓ డాక్టర్ కు, ముగ్గురు నర్సులకు, హౌస్ కీపింగ్ స్టాఫ్ లో ఒకరికి ఇప్పటికే వైరస్ పాజిటివ్ రావడం గమనార్హం.

 

ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో పని చేస్తున్న ఆరుగురు నర్సులు, ఇద్దరు డాక్టర్లకు, ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రాగా, వీరికి వ్యాధి ఎలా సోకిందన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. ఇక  జ్వరం, దగ్గ, జలుబు లేకుంటేనే ఓపీ సేవలు అందిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపస్తే, తొలుత క్వారంటైన్ సెంటర్లకు, ర్త పరీక్షల తరువాత పాజిటివ్ వస్తే, ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: