దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి డేంజ‌న్ బెల్స్ మోగిస్తోంది. పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న వైద్యుల‌కు కూడా వైర‌స్ సోక‌డంతో  తీవ్ర 
క‌లకలం రేపుతోంది.  తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన తరువాత ఇప్పటి వరకూ 24 మంది డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ స్టాఫ్ తదితర హెల్త్ కేర్ వర్కర్లు  ఈ వైరస్ బారిన ప‌డ‌టంతో మ‌రింత భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  వీరిలో ఇద్దరు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు ఉండగా, వీరిద్దరూ రెండు మొహల్లా క్లినిక్స్ లో పని చేశారు. సఫ్దర్ గంజ్ ఆసుపత్రిలో పని చేస్తున్న మరో డాక్టర్ కు తాను చికిత్స చేసిన రోగి నుంచి కరోనా సోకింది. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో పని చేస్తున్న ఆరుగురు నర్సులు, ఇద్దరు డాక్టర్లకు, ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రాగా, వీరికి వ్యాధి ఎలా సోకిందన్న విషయం అంతుబ‌ట్ట‌డంలేదు.  లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు బయట తిరగడం కూడా వారికి కరోనా సోకడానికి కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: