కరోనా రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా బారినప‌డి 630 మంది చ‌నిపోయారు. న్యూయార్క్ న‌గ‌రంలో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తోంది. దేశంలోని కేసుల్లో న్యూయార్క్‌లోనే ఎక్కువ‌గా న‌మోద‌వుతుండం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక్క‌డ రోగులకు చికిత్స అందించడానికి వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో  మిలటరీలో పనిచేసే వైద్య సిబ్బందిలో వెయ్యి మందిని అత్యవసర సేవల కోసం న్యూయార్క్‌కు పంపించారు. వెంటిలేటర్లకు కొరత ఏర్పడడంతో నగరానికి చైనా వెయ్యి వెంటిలేటర్లను పంపింది.  కాగా రాబోయే రోజులు మ‌రింత భయంకరంగా ఉం డబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. వచ్చే కొద్ది వారాల్లో కోవిడ్‌–19 మృతుల సంఖ్య‌ భయంకరంగా నమోదవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశాన్ని లాక్‌డౌన్‌ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకి చికిత్స చెయ్యాలే తప్ప నివారణ మార్గాల వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: