ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌.. భార‌త్ లోనూ బీభ‌త్సం సృష్టిస్తున్న‌ది.  చైనా, అమెరికా , ఇట‌లీ, స్పెయిన్ వంటి దేశాల్లో క‌రోనా ఎక్కువ‌గా పెద్ద వ‌య‌స్సు వారికి సంక్రమిస్తుండ‌గా, మ‌న‌దేశంలో మాత్రం అందుకు భిన్నంగా  కోరోనా కాటు యువ‌త‌రం పైనే ఎక్కువ‌గా ఉంది. ఈ విష‌యాన్ని ఇండియా టుడే డాటా ఇంటెలిజెన్స్ యూనిట్ ( డీఐయూ) వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్ర‌కారం మ‌న దేశంలో యువ‌త‌కే క‌రోనా ఎక్కువ‌గా  సంక్ర‌మి స్తున్న‌ట్లు తెలుస్తోంది.  మ‌న ద‌గ్గ‌ర న‌మోదైన పాజిటివ్ కేసుల్లో వ‌యోధికుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు 19 శాతం ఉండ‌గా, 80 ఏళ్లు దాటిన వారు 2 శాతం కన్నా త‌క్కువ‌గా ఉన్నారు. ఇక ప‌దేశ్ల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న వారు 3 శాతం ఉండ‌టం గ‌మ‌నార్హం.. 
ఏప్రిల్ రెండో తేదీ వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువ‌గా .. 20 నుంచి 49 ఏండ్ల వ‌య‌స్సువారే ఉన్నారు. ఇందులో 20 నుంచి 39 మ‌ధ్య వారు 43శాతం, 40 నుంచి 49 వ‌య‌స్కులు 17 శాతం వార‌కు ఉండ‌టం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: