దేశంలో రోజు రోజుకీ కరోనా మహమ్మారి విస్తరిస్తూ నానా బీభత్సం చేస్తుంది.  అయితే కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సదస్సు నుంచి తిరిగి వచ్చాక పలువురు తబ్ల్లిగీలు మర్కజ్‌ విశేషాల గురించి వివరించేందుకు ఆరోజున ప్రార్థనాస్థలాలకు వెళ్లడం కీలకంగా మారింది.  ఇండియాలో కరోనా వైరస్ ఇంతలా వ్యాపించడానికి కారణమైన ఒకే ఒక్క, అతిపెద్ద సోర్స్ గా  నిలిచిన న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్, మర్కజ్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్ కు విదేశాల నుంచి వచ్చి, ఆపై చెప్పాపెట్టకుండా దేశం విడిచి వెళ్లాలని భావించిన అందరిపైనా పోలీసుల చర్యలు మొదలయ్యాయి.  

 

నిన్న ఆదివారం నాడు తబ్లిగీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న ఢిల్లీ పోలీసుల స్పెషల్ టీమ్, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ దస్త్రాల్లో ఇండియాకు విదేశాల నుంచి వచ్చిన తబ్లిగీ కార్యకర్తల వివరాలన్నీ ఉన్నట్టు సమాచారం.  మార్చి 1 నుంచి 15 వరకు జరిగిన తబ్లీగ్ జమాత్ సమ్మేళనానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. గడచిన నాలుగు రోజుల్లో దాదాపు 2,000 కేసులు నమోదుకాగా, 70 శాతం మంది వీరే ఉన్నారు. 

 

తబ్లిగీ కార్యకర్తలపై (ఎఫ్ఐఆర్ నంబర్ 63), వారి నాయకులపై పలు నేరాల కింద కేసులను రిజిస్టర్ చేశామని వెల్లడించారు. కాగా, ఇక్కడ జరిగిన మత ప్రార్థనలు, వాటికి హాజరైన వారు, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు దాచి పెట్టడం తదితరాలపై ఇప్పటికే కేసు విచారణ ప్రారంభించాం  అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఢిల్లీ, చెన్నై ఎయిర్ పోర్టుల్లో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. 8 మంది మలేషియన్లు కౌలాలంపూర్ కు వెళుతున్న విమానాన్ని ఎక్కగా, వారిని దించివేశారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: