లోకంలో కరోనాతో పేగు బంధాలు కూడా చెల్లచెదురు అవుతున్నాయి.... మనుషుల జీవితం చెట్టుకొకరు పుట్టకొకరుగా మారింది.. నా అనుకున్న వాల్ల కడసారి కంటి చూపు కూడా దక్కడం లేదు.. ఇక బాధ్యతగా విధులు నిర్వహించే వారి పరిస్దితి మరీ దారుణంగా మారింది.. ముఖ్యంగా వైద్య సిబ్బంది సేవలు ఈ ప్రపంచంలో ఎవరు మరవలేరు.. ఒక వైద్య సిబ్బందే కాకుండా, పోలీసులు, పారిశుద్ద కార్మికులు.. వీరంతా కూడా కరోనాను లెక్క చేయకుండా, ఎదురయ్యే ఇబ్బందులను సమయస్పూర్తితో, మనో ధైర్యంతో జయించుకుంటూ తమ సేవలు అందిస్తున్నారు..

 

 

కొందరైతే తమ కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.. ఇలాగే ఓ కానిస్టేబుల్ తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించే క్రమంలో తన తల్లి మరణించిన కడసారి చూపుకు కూడా నోచుకోకుండా చేసింది కరోనా.. దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు లేని కారణంగా కాలు కదలలేని పరిస్దితులు నెలకొన్నాయి.. ఇలాంటి సమయంలో ఆ పోలీసు తనకు ఎదురైన విషాదాన్ని మనసులో అణుచుకుని, విధిలేని పరిస్థితుల్లో దుఃఖాన్ని దిగమింగుతూ విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.

 

 

మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, మెట్టపల్లి గ్రామానికి చెందిన గౌరినాయుడు తల్లి ఎల్లమ్మ (48) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. కాగా అనార్యోగం కారణంగా శనివారం మృతి చెందింది. ఇలాంటి పరిస్దితుల్లో ఒకవైపు కరోనా భయం, మరోవైపు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

 

 

చూశారా కన్నతల్లి ప్రేమముందు కరోనా గెలిచింది.. ఇలాంటి పరిస్దితి ఎదురైన వారికే బ్రతుకు విలువ, బంధం విలువ తెలుస్తుంది.. అందుకే ప్రభుత్వాలు కరోనా నుండి ప్రాణాలు కాపాడుకోండి.. మీ వారి ఆప్యాయతలు పొందండి అని అని ఇంతలా బ్రతిమిలాడుతున్నాయి.. ఈ వైరస్‌ను తక్కువగా అంచనా వేస్తే దారుణమైన పరిస్దితులు ఎదురవవచ్చూ.. అందుకే జాగ్రత్తగా ఉండండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: