వైఎస్ జగన్... ఈ పేరు గురించి పెద్దగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ వైస్ రాజశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తండ్రి మరణం తర్వాత రాజకీయాల దెబ్బకి కొన్ని నెలలు జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత రాజకీయ చదరంగంలో అపార చాణిక్యుడిలా ఎన్నికలలో నిలబడి ముందు సీఎం గా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుని ఎన్నడూ లేని విధంగా రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యయనంలా ఆయన్ని మట్టి కరిపించి వైస్ వైఎస్ జగన్ గద్దెని ఎక్కారు.

 

 

అయితే ఇదంతా బాగా ఉన్న ఇంకోవైపు ప్రస్తుము సీఎం జగన్ కి సోషల్ మీడియాలో గట్టి షాకే తగిలింది. ఇంతక ముందు ఆయన్ను భారీగా ఫాలో అయిన జగన్ అభిమానులు ఇప్పుడు ఆయన్ని అన్ ఫాలో అవుతున్నారు. అది అంకెల విషయానికి వస్తే ఇప్పుడు జగన్ ని దాదాపు పది లక్షల మంది అన్ ఫాలో కొట్టడం కాస్త ఆలోచింప చేసే విషయమే. నిజానికి ఎన్నికలకు ముందు జగన్ కి ఉన్న ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య చూస్తే 2.8 మిలియన్స్ మందికి పైగా ఉన్నారు. అంటే 28 లక్షలు. అయితే ఇప్పుడు ఆయన ఫాలోయింగ్ బారీగా తగ్గి పోయింది. 

 

 


ఇప్పుడు జగన్ ని ఫాలో అయ్యేవారు 1.7 మిలియన్స్ కి వచ్చింది ఆయన ఫాలోయింగ్. దీన్ని బట్టి ఏకంగా 11 లక్షల మంది అన్ ఫాలో చేసారు ఆయన్ని. ఇందులో ఫేక్ అకౌంట్స్ లో ఒక 2 లక్షలు తీసేసినా… దాదాపు 8 లక్షల మంది ఆయన అన్ ఫాలో చేశారు. దీనికి కారణం అనేది సరిగా తెలియక పోయిన గత పది రోజుల నుంచి ఆయన ఫాలోయింగ్ మాత్రం భారీగా తగ్గింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: