తెలుగు రాష్ట్రాలను కరోనా వణికిస్తోంది. కరోనా కేసుల్లో రెండు రాష్ట్రాలు నువ్వా నేనా అన్నట్లు గా పోటీపడుతున్నాయి. తాజాగా ఆంధ్రాలో మరో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అందులో వైజాగ్ లో 5, అనంతపురం 3,కర్నూల్ 2, పశ్చిమ గోదావరి మరియు గుంటూరు లో ఒక్కో కేసు నమోదైయింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266కు చేరింది. ఇందులో కర్నూల్ నుండి అత్యధికంగా 56 కేసులు నమోదు కాగా ఆతరువాత నెల్లూరు (34), గుంటూరు (32)లో అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుంది. ఇక  తెలంగాణ విషయానికి వస్తే నిన్న ఒక్క రోజే 62పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 300 దాటింది. అయితే అనూహ్యంగా రెండు రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య పెరగడానికి కారణం నిజాముద్దీన్ ప్రార్థనలే..  తెలుగు రాష్ట్రాల నుండి ఈ ప్రార్ధనలకు ఎక్కువ మందిహాజరు కావడం వారిలోచాలా మందికి కరోనా సోకడంతో వీరితో కాంటాక్ట్ అయిన వారికి కూడా పాజిటివ్ అని వస్తుంది.దాంతో  కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4000కు దాటగా ఇప్పటివరకు 100కు పైగా మరణించారు. 
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈక్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: