నిన్న రాత్రి 9 గంటల సమయంలో దీపాలు వెలిగించేటప్పుడు భౌతిక దూరాన్ని అందరూ తప్పకుండా పాటించాలని, ఎవరూ కూడా ఇళ్ల ముందు గీసుకున్న లక్ష్మణ రేఖను దాటకూడదని ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేసారు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే నే మోడీ చెప్పిన సూచనలను పెడచెవిన పెట్టి చాలా మంది బీజేపీ మద్దతుదారులను పోగేసుకొని హైదరాబాద్ లోని వీధుల వెంట పెద్ద పెద్ద దీపాలను పట్టుకుని గో కరోనా గో గో కరోనా అంటూ నినాదాలు చేశారు. మార్చి 22వ తేదీన చప్పట్లు పళ్ళాలు కొట్టుకొని మోడీ పిలుపు ఇవ్వగా... చాలా మంది ప్రజలు రోడ్లమీద గుంపులు గుంపులుగా వచ్చి భౌతిక దూరాన్ని పాటించకుండా లాక్ డౌన్ యొక్క ముఖ్య లక్షాన్ని చంపేశారు.


హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే రాజాసింగ్ లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేస్తూ... భౌతిక దూరాన్ని పాటించక పోవడంతో ఆయన పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు మోడీ కి విజ్ఞప్తి చేశారు. కానీ ఇంతవరకు భారతీయ జనతా పార్టీ నుండి అతనిపై చర్యలు తీసుకుంటున్నట్టు ఎటువంటి నోటీసు రాలేదు. ఇకపోతే భారత దేశ ప్రజలతో పాటు ఆస్ట్రేలియా వాళ్లు, ఇంకా ఇతర దేశస్తులు కూడా ఫోన్ టార్చ్ ఆన్ చేయడం, కొవ్వొత్తులు, మట్టి దీపాలు వెలిగించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.


మతపరమైన సదస్సులో పాల్గొనడం వలన భారతదేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో కేంద్ర రాష్ట్ర యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రతి ఒక్క పార్టీ నేతతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి ఎలాగుందో తెలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 321 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కొత్త కేసులన్నీ తబ్లీజీ జమాత్ వారివల్లేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: