ఏపీలో క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోంది. సోమ‌వారం ఉద‌యంతో ఏపీలో 226కు చేరిన పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఇక ఇప్ప‌టికే ఓ వ్య‌క్తి చ‌నిపోగా సోమ‌వారం మ‌చిలీప‌ట్నంలో ఓ వ్య‌క్తి... అనంత‌పురంలో మ‌రో వ్య‌క్తి మృతి చెందారు. ఇక ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య ఇప్ప‌టికే మూడుకు చేరుకుంది. తాజాగా క‌రోనా విజృంభ‌ణ‌తో జ‌గ‌న్ స‌ర్కార్ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో ఎక్క‌డైతే హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ర్యాపిడ్ స‌ర్వే నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యారు.

 

ఇక గ‌త 12 గంటల్లో 14 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక తాజా నిర్ణ‌యంలో భాగంగా పాజిటివ్ వ్య‌క్తుల ఇళ్ల‌కు కిలోమీట‌ర్ వ‌ర‌కు రాక‌పోక‌లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఏ ప్రాంతంలో అయినా క‌రోనా పాజిటివ్ ఉన్న వ్య‌క్తులు ఉంటే వీరి ఇళ్ల‌కు కిలోమీట‌ర్ వ‌ర‌కు ఎలాంటి రాక‌పోక‌లు లేకుండా.. జ‌న‌స‌మ్మ‌ర్దం లేకుండా చూడాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక సీఎం జ‌గ‌న్ అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డంతో లాక్ డౌన్ ఎక్క‌డిక‌క్క‌డ లాక్ డౌన్ స్ట్రిక్ట్‌గా అమ‌లు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: