ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా హ‌వా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో అన్ని దేశాలు భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 1271875 ఉన్నాయి. వీటిలో 261424 మంది రికవరీ అయ్యారు. అందువల్ల ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 941046గా చెప్పుకోవచ్చు. ఇక క‌రోనా మ‌ర‌ణాల విష‌యానికి వ‌స్తే 69405కి చేరాయి. ఈ లెక్క‌లతో ప్ర‌జ‌లు తీవ్రంగా వ‌ణికిపోతున్నారు. క‌రోనా అంటేనే ఆమ‌డ దూరం పారిపోతున్నారు.

 

అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో.. తమిళనాడులోని పనపాక్కం సమీపంలో కాకులు పెద్దఎత్తున మరణిస్తూ ఉండటంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇక్కడికి సమీపంలోని పన్నియార్ గ్రామంలోని కులత్తుమేడు ప్రాంతంలో ఈ నెల 1న దాదాపు 10కి పైగా కాకులు ఒకేసారి మరణించాయి. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా ప్రజలు బయటకు రాకపోవడంతో ఆహారం లేక కాకులు మరణించి ఉంటాయని తొలుత అంద‌రూ భావించారు. 

 

కానీ,  నిత్యమూ నివాస గృహాలపై నీరసంగా కనిపిస్తున్న కాకులు, ఒకదాని తరువాత ఒకటి అకస్మాత్తుగా మరణిస్తూ ఉండటం, మృతి చెందిన కాకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌డంతో వారి భయాలు రెట్టింపు అయ్యాయి. ఎందుకంటే ప్ర‌స్తుతం క‌రోనా వేగంగా విస్త‌రిస్తోంది. ఈ టైమ్‌లోనే కాకులు మ‌ర‌ణించ‌డంతో.. వాటికి  కరోనా వైరస్ సోకిందని, అందుకే ఇవి మరణిస్తున్నాయని భయపడుతూ ఉన్నారు. దీంతో విష‌యం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారుల బృందం, కాకుల మరణానికి కారణాన్ని అన్వేషించేందుకు రంగంలోకి దిగింది. వీటి మృతి వెనుక ఆకలి బాధే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయాన్ని తేల్చే ప‌నిలో బిజీ అయ్యారు. ఏదేమైన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు మాత్రం కాకులకు సైతం క‌రోనా వ‌చ్చింద‌ని ఆదోళ‌న‌గా ఉంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: