ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇక కరోనా వల్ల అన్నీ బంద్ కావడంతో ఇంటి పట్టునే ఉంటున్నారు.  అయితే ఇది అంతా తమ ఆరోగ్యం కోసమే అని ప్రభుత్వాలు అంటున్నాయి.  కానీ కొంత మంది మూర్ఖులు ఇంటి పట్టున ఉండటం ఇబ్బంది పడటంతో అసహానికి గురి అవుతున్నారు.  దాంతో ఈ ప్రభావం ఇంట్లో ఉన్న ఆడవారిపై చూపిస్తున్నారు.    ప్రజలు బయటికి రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

 

ఓ వైపు ప్రాణాంతక మహమ్మారిపై ప్రభుత్వాలు యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మహిళలపై గృహహింస పెరిగింది. ఈ విషయం స్వయంగా  యునైటెడ్ నేషన్స్ గుర్తించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై హింస దారుణంగా పెరిగిందని, వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని దేశాల ప్రభుత్వాలను కోరింది. భారత్‌లో లాక్‌డౌన్ విధించిన తొలివారంలో సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు స్థాయిలో మహిళలపై గృహ హింస పెరిగినట్టు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. ఫ్రాన్స్‌లో మూడు రెట్లు పెరిగినట్టు అధికారులు గుర్తించారు. 

 

విచిత్రం ఏంటేంటే లాక్ డౌన్ ప్రరకటించినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు.. ఇతర్ అత్యాచారాల, దోపిడి కేసులు తగ్గాయి. కానీ ఇంటి పట్టున ఉంటున్న మగాళ్ల అరాచకాలు మాత్రం పెరిగిపోతున్నాయి.  గృహహింసలో భయంకరమైన పెరుగుదలను మేం గుర్తించాం. కొవిడ్-19 కట్టడికి తీసుకునే చర్యల్లో భాగంగా ఆయా దేశాల ప్రభుత్వాలు ముందుగా మహిళలపై హింసను అరికట్టడం చాలా ముఖ్యం  అని యునైటెడ్‌ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పలు భాషల్లో తమ సందేశాలు తెలిపారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: