చాలా మంది జంతు ప్రేమికులు ఉంటారు. కొంద‌రు వాటిని ఎంతో అల్లారు ముద్దుగా ఇళ్ళ‌లో పెట్టుకుని వాటికి ఏ లోటూ రాకుండా ప్రేమిస్తారు. వాటి కోసం ఎంత దూర‌మైన వెళ్ళ‌డానికి సిద్ధ‌ప‌డ‌తారు. మ‌రికొంద‌రైతే వాటిని పిల్ల‌ల‌క‌న్నా ఎక్కువ‌గా ప్రేమిస్తుంటారు. అవి కూడా అంతే ప్రేమ‌గా వాళ్ళ‌కు క‌నెక్ట్ అయిపోయి ఉంటాయి. య‌జ‌మాని ఎక్క‌డిక‌న్నా బ‌య‌ట‌కు వెళ్ళి వ‌స్తే చాలు మీద మీద ప‌డి వాటి ప్రేమ‌ను చూపిస్తూ ఉంటాయి. మ‌రి కొన్న‌యితే కొన్ని రోజులు వాటిని పెంచే య‌జ‌మాని క‌నిపించ‌పోతే బెంగ పెట్టేసుకుంటాయి. అంత క‌నెక్ట్ అయిపోయి చాలా జంతువులు ఉంటాయి. అలాంటి జంతువుల‌కి ఏదైనా జ‌రిగితే త‌ట్టుకోలేరు కొంద‌రు. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి  కేర‌ళ‌లో చోటుచేసుకుంది. ఆ య‌జ‌మానిని ఏకంగా కోర్టు మెట్లెక్కేలా చేసింది.

 

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా లాక్‌డౌన్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో మ‌నుషులెవ్వ‌రూ బ‌య‌ట‌కు రావ‌డానికి లేదు. అంద‌రూ త‌మ ఇళ్ళ‌కే ప‌రిమిత మ‌య్యారు. కేర‌ళ‌లో ఓ వ్య‌క్తి  మూడు పిల్ల‌లును ఎంతో ప్రేమ‌గా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నాడు. లాక్ డౌన్ వల్ల పిల్లులకు పెట్టే ఆహారం అంతా అయిపోయింది. దాంతో ఎలాగైనా వాటికి ఆహారం తేవాలని ప్రకాశ్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆయ‌న‌ ఆన్ లైన్ లో పాస్ ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరాడు. కాని అందుకు వారు అంగీకరించలేదు. దాంతో ప్రకాశ్ పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేరళ హైకోర్టులో పిటీషన్ వేశాడు.

 

ఏమ‌ని అంటే...‘నేను మూడు పిల్లలను పెంచుకుంటున్నాను. నేను శాఖాహారిని కావడంతో వాటికి మీయో పెర్షియన్ అనే బిస్కట్లను ఆహారంగా ఇస్తాను. అయితే ఇప్పుడు ఆ బిస్కెట్లు అయిపోయిన కార‌ణంగా వాటి కోసం నేను ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్నాను. 7 కేజీల బరువుండే ఒక ప్యాకెట్ వాటికి మూడు వారాలు సరిపోతుంది. ఇప్పుడు బిస్కెట్లు అయిపోవడంతో.. ఏప్రిల్ 4న ఆన్ లైన్ లో పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ, పోలీసులు మాత్రం నా దరఖాస్తును తిరస్కరించారు. దాంతో ప్ర‌కాశ్ కి చాలా కోసం వ‌చ్చి పోలీసుల మీద జంతు చట్టంలోని సెక్షన్ 3 మరియు 11ల ప్రకారం.. పెంపుడు జంతువులకు ఆశ్రయం మరియు ఆహారాన్ని పొందే హక్కు ఉంద‌ని ఆయ‌న కోర్టు మెట్లెక్కాడు. కోర్టు దీనిపై తగు నిర్ణయం తీసుకుంటుంది’ అని ప్రకాశ్ అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న క్లిష్ట ప‌రిస్థితుల్లో కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: