అమ్మ అను మాటకి అర్దాలే వేరు. చిన్నపటి నుంచి మనల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఒక గొప్ప స్థాయిలో ఉంచింది అమ్మ. ప్రతి ఆడపిల్ల ఒక అమ్మ.. అమ్మాయి జీవితం తల్లి అయినప్పుడే పరిపూర్ణం అవుతుంది. సగ జీవితం పుట్టినింట్లో, సగం జీవితం మెట్టినింట్లో గడిపేస్తుంది.. అమ్మ, నాన్న కోసం పుట్టినింట్లో గడిపేస్తుంది. భర్త, పిల్లలు అత్త మామ కోసం సగం జీవితం అంకితం చేస్తుంది. ఎవరో తెలియని వ్యక్తితో తాళి అనే బంధంతో  అమ్మ, నాన్నలని వదిలి మెట్టినింట్లో అడుగుపెడుతుంది. తర్వాత భర్త, సంసారం ఇదే జీవితం. 

 

 

తెలిసి తెలియని వయసులో బిడ్డ కడుపులో పడ్డాడు అన్న విషయం తెలిసి ఎంతో సంబరపడిపోతుంది మన పిచ్చి తల్లి.. వాంతులు, వికారం, నీరసం అన్ని భరించి నవమాసాలు మనల్ని మోస్తుంది.పుట్టే బిడ్డ ఆరోగ్యంగా, బలంగా ఉండాలని  ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంటుంది. నవమాసాలు మనల్ని మోసి పురిటి నొప్పులతో అల్లాడిపోతోంది.. ఆడదానికి ఇదే మరో జన్మ. ఎన్ని నొప్పులు భరించిన పుట్టిన మనల్ని చూసుకుని ఆ నొప్పులన్ని మర్చిపోతుంది. మనల్ని చూసుకుని హాయిగా నవ్వుకుంటుంది.. గుండెలకి హత్తుకుని తాను పడ్డ కష్టాలన్నీ మర్చిపోతుంది.. భర్తకి  మొట్టమొదటి సారి భార్య ఇచ్చే అతి పెద్ద బహుమతి బిడ్డే. 

 

 

భర్త తన బిడ్డని చూసుకుని ఎత్తుకుని ఆడిస్తుంటే ఆ అమ్మ కళ్ళలో ఆనందాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. పొత్తిళ్లలో ఉన్న  పసి పాపకి  పాలు ఇచ్చి బిడ్డ ఆకలి తీరుస్తుంది అమ్మ. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది మనల్ని. అలాంటి  అమ్మ పిల్లల  పట్ల ప్రేమను చూపినప్పుడు మాత్రమే అమ్మని ప్రేమించువారిది నిజమైన ప్రేమ కాదు. అమ్మ తిట్టినా తన్నినా కూడా అమ్మ పాదాలను విడువకుండా  పట్టుకోగలిగిన వారిదే నిజమైన ప్రేమ. నవ్వుతు మాట్లాడితే ఇష్టం అని కోపంతో మాట్లాడితే కష్టం అని అనుకోకూడదు. 

 

 

 

మన అమ్మ కూడా మనల్ని మోసేటప్పుడు కష్టం అనుకుంటే మనం అనే వాళ్ళం ఈ భూమి మీద ఉండము.. మనల్ని తయారు చేసింది అమ్మ... అమ్మ ప్రతిరూపమే బిడ్డ.. ఉయ్యాలనూపే వయ్యారి చేయి అమ్మది, మనకి  ఊపిరినిచ్చేది అమ్మ, చివరకు తండ్రిని పరిచయం చేసెది అమ్మ, ప్రతి ఫలం కోరనిదాత అమ్మ. అమ్మ ఇచ్చె ముద్దు జన్మజన్మలకి నడిచే వచ్చే ఓ తియ్యని జ్ఞాపకం, అమ్మ కౌగిలి ఓ మదురానుబూతి, అమ్మ ఒడే మనకి శ్రీరామ రక్ష...! అమ్మ  మనల్ని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటుంది.. మనం కూడా అమ్మని ప్రేమిద్దాం.  అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని మళ్ళీ చూద్దాం... !!

మరింత సమాచారం తెలుసుకోండి: