క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా వ్య‌వ‌స్థ‌లు అన్ని కుప్ప‌కూలిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే స్టాక్ మార్కెట్లు సైతం ఢ‌మాల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా దెబ్బ ఫౌల్ట్రీ రంగంపై కూడా ప‌డింది. ఫౌల్డ్రీ రంగం పూర్తిగా డౌన్ అయ్యింది. నిన్న‌టి వ‌ర‌కు కొండెక్కిన గుడ్డు ధర ఇప్పుడు పూర్తిగా కూలిపోయింది. మార్కెట్‌లో రూ. 6. నిన్న మొన్నటి వరకూ రూ. 3 ఉన్న కోడిగుడ్డు ధర అమాంతంగా రెట్టింపు ధర పలుకుతోంది. అస‌లు క‌రోనా వైర‌స్సే చికెన్‌, మ‌ట‌న్ మాంసాహారాల వ‌ల్ల వ‌స్తుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో అంద‌రూ చికెన్‌, మ‌ట‌న్‌తో పాటు కోడిగుట్ల‌ను కూడా తిన‌డం ఆపేస్తున్నారు.

 

మ‌రోవైపు ప్రభుత్వాలు కూడా కోడిగుడ్లు, మాంసం తిన‌డం వ‌ల్ల ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ ప్ర‌చారంతో ప్రజల్లో చైతన్యం వచ్చేసి గుడ్లు, చికెన్‌ని విపరీతంగా కొనేస్తున్నారని దీంతో రేట్లు భారీగా పెరిగిపోయాయని ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనంపై టాలీవుడ్ నిర్మాత‌ బండ్ల గణేష్ బోరు మంటున్నారు. తాను కొండెక్కిన గుడ్డు ధ‌ర అనే క‌థ‌నం ప‌త్రికలో చ‌దివాన‌ని.. కోళ్ల పరిశ్రమ అంటే చికెన్ కి సంబంధించిన కోడి కాదు కోడి రైతు అంటే కోడిగుడ్లు అమ్ముకునే వాడని రైతు అంటారు, ఈ రోజు కోళ్ల ప‌రిశ్ర‌మ అంతా తీవ్ర న‌ష్టాల్లో ఉంద‌ని... ఈ రోజు మా ఉత్పత్తి ధర నాలుగు రూపాయల 20 పైసలు అవుతుంది. మాకు మాత్రం రెండు రూపాయల ఎనభై పైసల నుంచి మూడు రూపాయలు మాత్రమే వస్తుంద‌ని బండ్ల వాపోయాడు.

 

మా న‌ష్టాన్ని అర్థం చేసుకుని మ‌మ్మ‌ల‌ను కాపాడాల‌ని త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంత‌కు ముందు కూడా బండ్ల ఇదే అంశంపై మాట్లాడుతూ ‘మా పరిస్థితి ముందుకెళ్తే గొయ్యి.. వెనుకకి వెళ్తే నుయ్యిలా ఉంది. కోట్లు పెట్టుబడి పెట్టాం. భయంగా ఉంది.’ అంటూ కోడికి ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేశాడు. ఏదేమైనా కోళ్ల ప‌రిశ్ర‌మ ఎంత న‌ష్టాల్లో ఉందో ఆ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో అనుభ‌వం ఉన్న బండ్ల చెప్పేశాడు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: