కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న వాళ్ళకి సంఘీభావంగా ఒకపూట భోజనం మానేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి పిలుపిచ్చాడు. కాకపోతే ఆయన భోజనం మానేయమని చెప్పింది యావత్ దేశ ప్రజలందరినీ కాదులేండి. కేవంత బిజెపి కార్యకర్తలకు మాత్రమే చెప్పాడు. ఇప్పటికే ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలార్పేయమన్న పిలుపుపై జనాలు పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

మొదటిసారి జనతా కర్ఫ్యూ తర్వాత సాయంత్రం తప్పట్లు కొట్టమన్నాడు. ప్రధానమంత్రి చెప్పాడు కదాని జనాలందరూ తప్పట్లు కొట్టారు.  తర్వాత వైరస్ ను నియంత్రించేందుకు దేశమంతా మూడు వారాల పాటు లాక్ డౌన్లో ఉండాలంటే నిజమే కదా అని అందరూ పాటించారు. తాజగా ఆదివారం నాడు రాత్రి ఇంట్లో లైట్లు ఆపేసి దీపాలు వెలిగించమని చెప్పారు. అయితే మొదటి రెండుసార్లు మాట్లాడకుండా చెప్పిన పని చేసిన జనాలు మూడో విషయానికి కొచ్చేసరికి సెటైర్లు మొదలుపెట్టేశారు.

 

ఈ సెటైర్లు ఇంకా కంటిన్యు అవుతుండగానే బిజెపి కార్యకర్తలకు మళ్ళీ నాలుగో టాస్క్ పెట్టారు. కరోనా పై పోరాటం చేస్తున్న జనాలకు సంఘీభావంగా కార్యకర్తలందరూ ఓపూట భోజనం మానేయాలని పిలపుచ్చారు. మరి ఒకపూట భోజనం మానేయటం అన్నది కేవలం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన  సోమవారం ఒక్కరోజేనా లేకపోతే వైరస్ సమస్య ఉన్నంత కాలమూనా అన్నది చెప్పలేదు.

 

మొత్తం మీద మోడి పిలుపులు మాత్రం విచిత్రంగా ఉంటున్నాయి. కరోనా వైరస్ పై పోరాడుతున్న జనాలకు సంఘీభావంగా ఒకపూట భోజనం మానేస్తే ఏమవుతుంది ? భోజనం మానేస్తే వైరస్ స్ప్రెడ్ ఆగిపోతుందా ? లేకపోతే వచ్చిన వైరస్ తగ్గిపోతుందా ? అంటూ కామెంట్లు మొదలయ్యాయి. కార్యకర్తలు ఒకపూట భొజనం మానేయటినికి వైరస్ పై పోరాటానికి ఏమిటి సంబంధమో ప్రధానమంత్రే చెప్పాలి. ఇంకానయం భోజనం మానేయమని పార్టీ కార్యకర్తలకు మాత్రమే చెప్పాడు. అదే యావత్ దేశంలోని ప్రజలందరు మానేయాలని చెప్పుంటే పరిస్ధితి ఇప్పటికే మరోలాగుండేదేమో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: