కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి ఒకవేళ చనిపోతే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుందా ...? అని చాలామందిలో ఇవే అనుమానాలున్నాయి మనకి. అయితే దీనిపై లైఫ్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ (LIC) క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంతో చనిపోతే కనుక క్లెయిమ్ సెటిల్ చేయాల్సిన బాధ్యత నైతికంగా, చట్టబద్ధంగా ఇన్స్యూరెన్స్ కంపెనీలపైన ఉందని lic మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. 

 


అంతే కాక  ప్రైవేట్ ఇన్స్యూరెన్స్, ప్రభుత్వ రంగ కంపెనీలన్నీ కరోనా వైరస్‌ కు సంబంధిత డెత్ క్లెయిమ్స్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం కచ్చితమని తెలిపారు. ఇక్కడ 'ఫోర్స్ మ్యాజర్' అంటే అనూహ్య పరిస్థితులు అనే క్లాజ్ కరోనా వైరస్ డెత్ క్లెయిమ్స్‌ కు నూటికి నూటి పాళ్లు వర్తిస్తుందని స్పష్టం చేసింది. మాములుగా మనం 'ఫోర్స్ మ్యాజర్' క్లాజ్‌ ను నియంత్రించలేని, ఊహించలేని చర్యలు, పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుందని lic మేనేజ్మెంట్ వివరించింది. కాకపోతే కొద్దీ రోజుల నుండి ఇటీవల కరోనా వైరస్ దెబ్బ విజృంభిస్తుండటంతో, మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటంతో పాలసీ దారులలో అనేక రకాల అనుమానాలు పెట్టుకున్నారు

 

 


అయితే ఒకవేళ అసలు కరోనా వైరస్‌ తో కానీ మరణిస్తే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా ...? లేదా అనే డౌట్స్ వారికీ బలంగా ఉన్నాయి. వారంతా ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఇప్పుడు సంప్రదిస్తున్నారు. దీనితో లైఫ్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ (LIC) ఈ సందేహాల అన్నిటికి గాను పూర్తి క్లారిటీ ఇచ్చింది. దీనితో పనికిమాలిన పుకార్లకు ఫుల్‌స్టాప్ పది నట్టు అయ్యింది. ఈ విషయాన్నీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ (LIC ) సెక్రెటరీ జనరల్, ఎస్ ఎన్ భట్టాచార్య తెలిపారు. ఇంకా ఆయన లాక్‌డౌన్ కారణంగా పాలసీ హోల్డర్లు ఇబ్బందులు అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీ ఆలోచనలు చేస్తుంది. ఇంకా వారికోసం డిజిటల్ పద్ధతుల్లో సేవలు అందిస్తోంది కాబట్టి వాటిని ఎక్కువగా ఉపయోగించాలని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: