ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న ఏపీ లో వైరస్ ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతున్నట్టు కనిపిస్తోంది. వారం రోజులుగా కేసుల సంఖ్య ఏపీలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి . ఆదివారం ఒక్కరోజులోనే ఏపీలో అనూహ్యంగా 60 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆదివారం సోమవారం ఉదయం 9 గంటల వరకు ఏపీలో మొత్తం 16 వరకు కేసుల నమోదు కావడంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 268 కు చేరుకుంది. ఏపీలో రోజురోజుకు ఈ విధంగా పోస్టు కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు ఏపీలో కఠినంగా అమలు చేస్తున్నా, పరిస్థితి అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. 


తాజాగా ఏపీలో ఈరోజు నమోదైన కేసుల సంఖ్య ఒకసారి పరిశీలిస్తే.... విశాఖపట్నంలో 5, అనంతపురంలో 3, కర్నూలు లో 6, గుంటూరులో 2 పశ్చిమగోదావరి జిల్లాలో ఒక కేసు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసులన్నీ ఢిల్లీలోని మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడంతో  మరింత ఆందోళన కలిగిస్తోంది.ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఈ జిల్లాలో ఇప్పటికే యాభై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 56 కు చేరాయి.


 పాజిటివ్ వచ్చిన వారిని నంద్యాల లోని శాంతిరాం ఆస్పత్రికి తరలించారు. కర్నూలు జిల్లాలో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే కర్నూలు అర్బన్లో 18, నంద్యాల లో 10, నందికొట్కూరులో మూడు, ఆత్మకూరు 2, బనగానపల్లె 3, నంద్యాల రూరల్ 2, బేతంచెర్ల 1, గడివేముల 2 పాణ్యం 4 , పాణ్యం 4, రుద్రవరం 1 , కోడుమూరు కోడుమూరు 3 గా నమోదయ్యాయి. ఇక ఈ విధంగా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు నిబంధనలు కఠినంగా అమలు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని కోరినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: