మహమ్మారి కరోనా వైర‌స్ ప్రపంచ దేశాలపై కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంటూ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  ఈ నేపథ్యంలో క‌రోనా వైర‌స్ కు మందు క‌నిపెట్ట‌డం కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కు మందు క‌నుగొన్న‌ట్టు ఓ ప‌రిశోధ‌న కేంద్రం తెలియ‌జేసింది. ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్టులు యాంటీ పారాసిటిక్ డ్ర‌గ్ ను ల్యాబ్ లో అభివృద్ధి చేసి వాటిని SARS-COV-2 వైర‌స్ మీద ప్ర‌యోగించారు. ఈ డ్ర‌గ్ 48 గంట‌ల్లో వైర‌స్ ను చంపేసిన‌ట్లు ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డ‌య్యింది. ఈ డ్ర‌గ్ రెండు రోజుల్లో మొత్తం వైర‌స్ ను అంతం చేసిన‌ట్టు తెలిపింది. Ivermectin సింగ‌ల్ అనే డోస్ క‌రోనా వైర‌స్ వృద్ధి చెంద‌కుండా నియంత్రించిన‌ట్టు తెలిపింది. Ivermectin సింగిల్ డోస్ వైర‌స్ ను 48 గంట‌ల్లోనే అంతం చేసిన‌ట్టు గుర్తించాం. అలాగే 24 గంట‌ల్లో కూడా బాగా త‌గ్గించ‌గ‌లిగింద‌ని డాక్ట‌ర్ కైల్ వాగ్ స్టాఫ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: