ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఈరోజు కరోనా కట్టడి నియంత్రణ చర్యల్లో భాగంగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, ఫార్మసీలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ప్రజలు రెండు వారాలకు మించి సరుకులు కొనుగోలు చేయకూడదు. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్ల నిర్వాహకులు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. 
 
కిరాణా షాపులలో, సూపర్ మార్కెట్లలో పని చేసే సిబ్బందికి కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వారు పనికి వెళ్లరాదు. పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులను సూపర్ మార్కెట్లలోకి అనుమతించాలి. కస్టమర్లు ఎక్కువ మంది ఉంటే క్యూ లైన్లను ఏర్పాటు చేసి వారిని అనుమతించాలి. క్యూ లైన్ లో ఒక కస్టమర్ కు మరొక కస్టమర్ కు కనీసం ఆరడుగులు దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. పార్కింగ్ సదుపాయం లేని సూపర్ మార్కెట్ల యజమానులు ఎస్.ఎం.ఎస్ టోకెన్ విధానాన్ని అమలు చేయాలి. 
 
ఎవరైనా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తే వారికి సరుకులు డోర్ డెలివరీ అయ్యేలా చర్యలు చేపట్టాలి. 101 డిగ్రీల కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత ఉన్నవారిని దుకాణాల్లోకి అనుమతించకూడదు. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర హ్యాండ్ శానిటైజర్ ను అందుబాటులో ఉంచాలి. ఎక్కువగా ఆన్ లైన్ చెల్లింపులే జరిగేలా చూసుకోవాలని... ఆన్ లైన్ చెల్లింపులు చేయలేని వారి దగ్గర మాత్రమే నగదు స్వీకరించాలని.... నగదు ఇచ్చే సమయంలో, తీసుకునే సమయంలో వలలను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: