క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల వేల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోగా.. ల‌క్ష‌ల్లో బాధితులు ఉన్నారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ... 204 దేశాల్లో కరోనా తన ఉనికి చాటుకుంది. కరోనాను కట్టడి చేయడం అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా వల్లే కావడం లేదు. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. అయితే కరోనా తొలుత వెలుగు చూసింది చైనాలో అన్న విష‌యంతో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

చైనాలో సుమారు 80 వేల కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తే, సుమారు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చైనా, కరోనా నుంచి కోలుకుంది. ఇదిలా ఉంటే.. చైనా కక్కుర్తి, వక్ర బుద్ధి ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఉదాహరణ ఇది. చైనాలో కరోనా విజృంభించగానే ఆ దేశానికి ఇటలీ సాయపడింది. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) ను చైనాకు ఉచితంగా పంపించింది. అయితే ఇప్పుడు అదే ఇటలీ కరోనా కోర‌ల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు ప‌డుతోంది. ముఖ్యంగా పీపీఈల కొరతతో అల్లాడుతోంది. 

 

దీన్ని సొమ్ము చేసుకోవడానికి చైనా కక్కుర్తిని ప‌ద‌ర్శించింది. తమకు ఉచితంగా పీపీఈలను ఇచ్చిన ఇటలీకి...  అవే పీపీఈలను అమ్మింది. ఈ మేర‌కు స్పెక్టేటర్ మీడియా సంస్థ వెల్లడించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలోని ఓ అధికారి మాట్లాడుతూ చైనాపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇటలీ ఫ్రీగా ఇచ్చిన వాటిని మళ్లీ తిరిగి కొనేలా చైనా ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు. యూరప్ కు మహమ్మారి సోకక ముందు చైనాలో ఉన్న తన పౌరులను కాపాడుకునేందుకు ఇటలీ టన్నుల కొద్ది పీపీఈలను పంపించిందని చెప్పారు. 

 

అవే పీపీఈలను ఇటలీకి పంపించి దాన్నుంచి చైనా సొమ్ము చేసుకుందని విమ‌ర్శించారు. అంతేకాకుండా ప్ర‌స్తుతం చైనా మాస్క్‌లు, వెంటిలేటర్లు  అమ్ముకునే ప‌నిలో బిజీగా ఉంది. మ‌రోవైపు చైనా.. సాయం చేస్తానంటూ పాక్‌కు అండర్‌వేర్లతో తయారు చేసిన మాస్కులు పంపిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైన‌ప్ప‌టికీ క‌రోనాతో ప్ర‌పంచ‌దేశాలు అల్లాడిపోతుంటే.. చైనాలో మాత్రం కక్కుర్తికి కేరాఫ్ అడ్రెస్‌గా మారింది అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: