ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్ ను నిర్వహించారు.  ఈ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే.    కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు.  ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాల గురించి చర్చించారు. 

 

ఎంపీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించాలని, ఎంపీలకు ఇచ్చే నిధులు (ఎంపీ లాడ్స్) ను రద్దు చేయాలన్న నిర్ణయాలను ప్రధాని మోదీ తీసుకున్నారు. ఏడాది పాటు ఎంపీల వేతనాలు, అలవెన్స్ లు, పెన్షన్లలో ఈ కోత ఉండేలా ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రులు స్వచ్చదంగా ఇచ్చిన విరాళాల విషయంపై కూడా చర్చించారు.  అంతేకాదు, రెండేళ్ల పాటు ఎంపీ నిధులకు బ్రేక్ వేస్తున్నట్టు కేంద్రం నిర్ణయం తీసుకుంది.  రెండేళ్లపాటు ఎంపీలకు ఎంపీ నిధులు అందుబాటులో ఉండవు. 

 

ఈ నేపథ్యంలో 1954 చట్టాన్ని సవరించింది. ఈ విషయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ ఈరోజు మీడియాకు వివరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎంపీ లాడ్స్  2020-21, 2021-22కు సంబంధించి మొత్తం నిధులు రూ.7900 కోట్లు అని, ఈ మొత్తంతో కన్సా లిడేటెడ్ ఫండ్ రూపంలో ఓ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: