ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుమిలిపోయే ప‌రిస్థితి ఇది. సీనియ‌ర్ రాజ‌కీయవేత్త అయిన చంద్ర‌బాబు ఆప‌త్కాలంలో వ్య‌వ‌హ‌రించాల్సిన త‌రుణంలో ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశం ఇదే రీతిలో అధికార వైసీపీ విమ‌ర్శించింది. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కరోనా నియంత్రణలోను, కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని, ప్రభుత్వ సూచనలను ప్రజలందరూ పాటిస్తున్నారని తెలిపారు. 

 

ప్రజలు, ఉద్యోగులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి వల్ల మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ముందుందని మంత్రి నాని పేర్కొన్నారు. ``లాక్ డౌన్ చేస్తూ కేంద్రం చెప్పిన నిర్ణయాల కంటే ముందే ఏపీ రాష్ర్టం అంతా కూడా లాక్ డౌన్ చేయాలని నిర్ణయించింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బాధ్యత మరిచి కష్ట సమయంలో కూడా తన నీచబుధ్దిని చూపించుకుంటున్నారు. రాష్ర్టంలోని పసిపిల్లల దగ్గర్నుంచి ముదుసలి వరకు చిరుద్యోగి నుంచి రాష్ర్ట సిఎం వరకు బాధ్యతాయుతంగా పగలు రాత్రి తేడా లేకుండా దేశ సరిహద్దులలో ఉద్యోగం చేసే సైనికులతో సమానంగా కరోనాను అరికట్టేందుకు యుధ్దం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో విమర్శలు చేయడం చంద్రబాబుకు కరెక్టెనా?`` అని మంత్రి ప్ర‌శ్నించారు.

 

రాష్ర్టం ఎలా ఉన్నా ఆరోపణలే చంద్రబాబుకు ముఖ్యమ‌ని నాని ఆరోపించారు. ``ఇలాంటి తప్పుడు మాటలు బాబుకు అలవాటే. పక్కరాష్ర్టంలో బతుకుతూ చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా చేతులు కడుక్కోండి. శుభ్రత పాటించండి అనే మంచి విషయాలు చెబుతున్నట్లు నటిస్తూ ప్రభుత్వంపై నిందాపనిందలు వేస్తున్నారు. కేేంద్రం ఇచ్చిన డబ్బులు ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. ఈ రాష్ర్టంలో కాకుండా పెళ్లాం, పిల్లలతో పరాయి రాష్ర్టంలో బతుకుతున్నావు. ఆనందమయ జీవితం గడుపుతున్నావు. `` అని మండిప‌డ్డారు. ``నరేంద్రమోదికి భార్యాపిల్లలు లేరు. నాకున్నారు నాకు పదవిపోయినా మనవడితో ఆడుకుంటానని చెప్పావు. ఆడుకో...ఎవరూ వద్దనరు. కానీ అక్కడ కూర్చుని కూడా నీ నక్కజిత్తుల తెలివితేటలు చూపిస్తున్నావు. ఇలాంటి నేతనా మేం ముఖ్యమంత్రిగా భరించిందనే బాధ``అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: