కరోనావైరస్ తో ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికిపోతోంది. క‌రోనా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు త‌ల్ల‌డిల్లి పోతున్నారు. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో స్టార్ట్ అయిన ఈ వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచం అంతా విస్త‌రించింది. ఈ క‌రోనా ఇప్ప‌టికే ఎంతో మంది దేశ అధ్య‌క్షులు, వారి కుటుంబీకుల‌కు కూడా సోకింది. ఇక తాజాగా బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్‌కు ఇప్ప‌టికే ఈ వైర‌స్ సోక‌గా ఇప్పుడు ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌కు కూడా సోకింద‌ని స‌మాచారం. 

 

బ్రిట‌న్‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గత పది రోజులుగా కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. పరీక్షల్లో బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ తెలిపారు. ఇక ఇప్పుడిప్పుడే ఆయ‌న కోలుకుంటున్నారు అనుకుంటోన్న టైంలో ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్ అయిన 32 ఏళ్ల కేరీ సైమండ్స్ కు సైతం క‌రోనా పాజిటివ్ ఉంద‌ని అంటున్నారు.

 

కేరీ సైమండ్స్‌తో బోరిస్ జాన్సన్ సహజీవనం చేస్తున్నాడు. దీన్ని విరిద్దరు ఇంతకుముందే ధ్రువీకరించారు. మ‌రో షాక్ ఏంటంటే కేరీ మ‌రో బాంబు కూడా పేల్చింది. వారం పది రోజుల కిందట తను జాన్సన్ తో బెడ్ ను పంచుకున్నట్టుగా ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో తనలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఆమె ప్రెగ్నెంట్ కావ‌డంతో పాటు క‌రోనా అనుమానాలు ఉన్న‌ట్టు సందేహాలు ఉండ‌డంతో ఆమె మరింత ఆందోళన చెందుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: