ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో లాక్ డౌన్ కు సంబంధించి ఎక్కువగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈనెల14 తో దేశ వ్యాప్తంగా విధించిన 21రోజుల లాక్ డౌన్ ముగియనుంది. అయితే రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో 14 తరువాత కూడా లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసే పరిస్థితి లేదు అలా అని కొనసాగిస్తే దేశం మరింత ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయే ప్రమాదం వుంది దాంతో కేంద్రం కూడా లాక్ డౌన్ ను పొడిగించడానికి రెడీ గా లేదని సమాచారం.
 
అయితే ఎక్కడైతే  కరోనా ప్రభావం ఎక్కువుందో వాటిని కోవిడ్ 19 హాట్ స్పాట్ లుగా గుర్తిస్తున్నారు. ఎక్కడైతే ఈ హాట్ స్పాట్ లేవో ఆయా ప్రాంతాల్లో దశలవారిగా అన్ని రకాల కార్యాకలాపాలను  పునరుద్దరించాలని మోదీ ,మంత్రులకు సూచించినట్లుగా తెలుస్తుంది. ఇందుకు మంత్రులు సన్నద్ధం కావాలని ఆదేశించారట. ఇక హాట్ స్పాట్ గా గుర్తించిన ప్రాంతాల్లో మరి కొన్ని రోజులు పూర్తి లాక్ డౌన్ ను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. 
 
ఇక ఇప్పటివరకు దేశంలో గడిచిన 24 గంటల్లో 693 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తంగా ఈ సంఖ్య 4067 కు చేరిందని ఇందులో 1445 కేసులు మర్కాజ్ ప్రార్ధనల వల్లే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: