ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తమ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టుకోలేక... మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేక ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా లాక్ డౌన్ కారణంగా కుదేలైంది. తెలుగు రాష్ట్రాలు కూడా టాక్స్ ల రూపంలో వచ్చే డబ్బులు చేతికి అందక... ఎన్నో అవస్థలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతలు కూడా తమకు చేతనైనంత డబ్బులను ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నారు. అసలు ఇవ్వనివారు కంటే కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చిన వారే ప్రస్తుతం విజేతలుగా ప్రజల మన్నలను పొందుతూ ఉన్నారు.


ఈ జాబితాలో ఖమ్మం జిల్లాకు చెందిన మమత వైద్య విద్యా సంస్థ అధినేత, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ. రెండు కోట్లను కేసీఆర్ కి విరాళంగా ఇచ్చారు. కాకపోతే ఆయన కేవలం 25 లక్షల రూపాయలను మాత్రమే విరాళంగా ఇవ్వగా... మిగతా రూ.75 లక్షలను ప్రముఖ వ్యాపార వేత్తలు, వర్తక వ్యాపారాలు విద్యాసంస్థలు, ఆసుపత్రి నిర్వాహకులు తదితరులు కలిసి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపుమేరకు దానం చేశారు. దాంతో రెండు కోట్లను పట్టుకొని పోయి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కి అందించారు. ఈ రెండు కోట్ల విరాళం లో వచ్చే ఖమ్మం జిల్లా ప్రముఖులు తమ దాతృత్వాన్ని చాటుకుని అందరి మన్ననలు పొందుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పుకుంటే... ఉంగుటూరు ఎమ్మెల్యే పుష్పాల శ్రీనివాసరావు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి 1 కోటి 4 లక్షల 7 వేల 838 రూపాయల చెక్కును అందచేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. మరోవైపు బీజేపి నేత కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్ కి రూ.10 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీడీలు అమ్మి డబ్బు సంపాదించినా వృద్ధురాలి నుండి రతన్ టాటా వరకు ఈ విపత్తు సమయంలో తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రజల విజేతలే.


మరింత సమాచారం తెలుసుకోండి: