భార్యాభ‌ర్త‌ల బంధమ‌నేది ఎంతో ప‌విత్ర‌మైన‌ది. ఒక‌ప్పుడు భార్య భ‌ర్త మాట‌కు ఎంతో విలువిచ్చేది. అలాగే భ‌ర్త కూడా భార్య మాట‌కు విలువిచ్చేవారు. ఇలా ఒక‌రికి ఒక‌రు ఎంతో అన్యోన్యంగా అప్యాయంగా ఉండేవారు. అప్ప‌టి భార్యా భ‌ర్త‌ల బంధానికి ఒక విలువుండేది. ఎంతో గౌర‌వం ఉండేది. ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రు గౌర‌వించుకునేవారు. కానీ నేటి యువ‌త‌లో అది క‌నిపించ‌డం లేదు. ఎంత సేప‌టికి ఒక‌రి మీద మ‌రొక‌రికి డామినేష‌న్ త‌ప్పించి వేరే ఏమీ క‌నిపించ‌డం లేదు. ఇద్ద‌రూ ఉద్యోగ‌స్తులైతే ఇక మ‌రింత డామినేష‌న్ ఉంటుంది. ప్ర‌స్తుతం రోజుల్లో ఉండే ఆర్ధిక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో ఇద్ద‌రూ ప‌ని చేస్తే కాని గ‌డ‌వ‌నప్పుడు ఇద్ద‌రూ ప‌ని చేయాల్సి వ‌స్తుంది. అలాంట‌ప్పుడు ఒక‌రి మీద ఒక‌రికి డామినేష‌న్ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇక ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం ఉన్న కంప్యూట‌ర్ కాలానికి త‌గ్గ‌ట్టు యంత్రాల్లా మారుతున్నారు నేటి మ‌నుషులు వారి బంధాలు. 

 

కంప్యూట‌ర్లు ఎంత ఫాస్ట్‌గా ఉంటున్నాయో భార్యాభ‌ర్త‌ల బంధాలు కూడా అంతే ఫాస్ట్‌గా ఉంటున్నాయి. ఒక‌రితో ఒక‌రు అని ఒక‌ప్పుడు ఉండేవారు. కాని ఇప్ప‌టి యుగంలో మాత్రం ఒక‌రికి ఒక‌రు స‌రిపోవ‌డం లేదు. వివాహేత‌ర సంబంధాలు ఎక్కువ‌యిపోతున్నాయి. దాంతో కొంత మంది క్ష‌ణిమావేశంతో ఐదు నిమిషాల సుఖం కోసం ఏమి చెయ్య‌డానికైనా వెన‌కాడ‌డం లేదు. భార్య‌ను భ‌ర్త.., భ‌ర్త‌ను భార్య చంప‌డానికి కూడా వెన‌కాడ‌డం లేదు. ఎంత‌టి అఘాయిత్యానికైనా ఒడిగ‌డుతున్నారు. మ‌రి ఇలాంటివ‌న్నీ త‌గ్గాలంటే ముందు భార్యా భ‌ర్త‌ల బంధానికి అర్ధం తెలుసుకోవాలి. పెళ్ళైంది, విడిపోయాం ఇది గొప్ప‌కాదు అలాగే ఎంతో మంది క‌లిసి ఉండేవాళ్ళ‌ని ఆద‌ర్శంగా తీసుకోవాలి. 

 

ఇక ఒక‌ప్పుడు ఇంట్లో పెద్ద‌వాళ్ళు ఉండేవారు వారు మంచి చెడు అనేది చెప్పేవారు. ఇప్ప‌టి రోజుల్లో అవ‌న్నీ ఉండ‌డం లేదు. పెళ్ళైన వెంట‌నే విడి కాపురాలు అయిపోతున్నాయి. దాంతో చిన్న వ‌య‌సులో ఏది మంచి ఏది చెడు అని గ్ర‌హించ‌లేక ఇలాంటి అన‌ర్దాల‌న్నీ ఎదుర‌వుతున్నాయి. కాబ‌ట్టి పెద్ద‌వాళ్ళు మ‌న ఇళ్ళ‌లో ఉండ‌డం వ‌ల్ల మ‌న‌కు తోడుగా ఉంటారు. మంచి చెడు అనేది చెబుతారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: