ఏపీలో క‌ర్నూలు జిల్లా క‌రోనా హ‌బ్‌గా మారిపోయింద‌న్న సందేహాలు వ‌స్తున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు ఈ జిల్లా ప్ర‌జ‌లు చాలా ప్ర‌శాంతంగా ఉండేవారు. అయితే ఒక్క‌సారిగా కేసుల స్వైర విహారం చేయ‌డంతో జిల్లాలో ఏకంగా 74 కేసులు న‌మోదు అయ్యాయి. నాలుగో తేదీ వ‌ర‌కు కూడా కేవ‌లం నాలుగు కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. అయితే గ‌త రెండు రోజుల్లోనే జిల్లాలో కేసులు విజృంభించాయి. ఆదివారం 52 కొత్త కేసులు న‌మోదు కాగా... ఈ రోజు పైకి పంపిన 55 రిపోర్టుల్లో మ‌రో 18 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది.

 

దీంతో జిల్లాలో అత్య‌ధికంగా 74 కేసులు వ‌చ్చాయి. నిన్న‌టి వ‌ర‌కు ఏపీలో టాప్ ప్లేసులో ఉన్న నెల్లూరు జిల్లాలో 42 కేసులు ఉండ‌గా.. ఇప్పుడు నెల్లూరును క‌ర్నూలు క్రాస్ చేసింది. ఇప్పుడు జిల్లా అంత‌టా రెడ్ అలెర్ట్ అమ‌ల్లో ఉంది. ఇక జిల్లాలో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు 15 క్వారంటైన్ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌గా.. మ‌రో 3 ఆసుప‌త్రుల‌ను కోవిడ్ ఆసుప‌త్రులుగా మార్చి వైద్యం అందిస్తున్నా కేసులు మాత్రం ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే జిల్లాలో ఏకంగా 1600 ప‌డ‌క‌లు ఏర్పాటు చేశారు. ఇక మ‌రో 300 మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా..వారిలో కూడా మ‌రికొంత మందికి క‌రోనా సోకి ఉంటుంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: