అవును ఇందులో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఏ స్ధాయిలో విజృంభిస్తోందో అందరికీ తెలిసిందే.  దేశవ్యాప్తంగా వైరస్ కేసులు ఎక్కువైపోతున్నా ఏపిలో మాత్రం వైరస్ వ్యాప్తి, మరణాలు ఇంకా అదుపులోనే ఉందంటే అందుకు ప్రభుత్వం యంత్రంగా చేస్తున్న కృషి ప్రధాన కారణం. మొత్తం యంత్రాంగాన్ని పక్కన పెడితే గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధ పనితీరు మాత్రం భేష్ అనే చెప్పాలి. జ్వరలక్షణాలను గుర్తించటంలోను, విదేశాల నుండి వచ్చిన వారి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించటంలోను వాలంటీర్లు బాగా కష్టపడుతున్నారు. సరే ఫించన్లు, రేషన్ ఇంటింటికి చేర్చటంలో వీళ్ళ కృషే ప్రధానం.

 

ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే విశాఖపట్నంలో ఓ వాలంటీర్ చేసిన పని వల్లే వాలంటీర్ల వ్యవస్ధతో పాటు  జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిన విషయాల్లో ఇళ్ళకే తీసుకుపోయి ఫించన్లను అందించటం. ఇందులో ప్రధాన పాత్ర వాలంటీర్లదే అనటంలో సందేహం లేదు.

 

ఇంతకీ విషయం  ఏమిటంటే విశాఖపట్నం జిల్లాలోని లోవముకుందాపురం అనే మండలం ఉంది. ఆ మండలంలో తేడ సింహాచలం వాలంటీర్ కు ఇద్దరికి పెన్షన్ అందించాల్సిన బాధ్యత పడింది. వాళ్ళిద్దిరికి ఫించన్ అందించాలంటే మధ్యలో రైవాడ అనే జలాశయాన్ని దాటుకుని గిరిజన గ్రామాలనికి వెళ్ళాలి. వైరస్ భయంతో జనాలు లాక్ డౌన్ పాటిస్తున్న వేళ సింహాచలం ఓ నాటు పడవలో ప్రయాణించి గిరిజన గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరే మహిళలున్నారు.

 

అయితే ఇద్దరే కదా అని వాలంటీర్ ఉపేక్షించలేదు. గ్రామానికి వెళ్ళి వంతు పోతమ్మ, వంతు పాపమ్మ అనే మహిళలు ఇద్దరికీ చెరో వెయ్యి రూపాయలు అందించాడు. ఇద్దరికి ఫించన్ అందించటం కోసమే  నాటు పడవలో వచ్చాడని తెలుసుకుని మిగిలిన గ్రామస్తులు సింహచలాన్ని అభినందనలతో ముంచేశారు.  అంటే ఇద్దరికి ఫించన్ అందించేందుకు వాలంటీర్ ఎంత రిస్క్ తీసుకుని వెళ్ళాడన్నదే ముఖ్యం. అందుకనే అందరినీ అభినందిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: