దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ, సామాజిక దూరం సరైన అస్త్రమంటూ కేంద్రం ప్రచారం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామం కేంద్రం నిర్ణయాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. 
 
బయటివాళ్లు ఎవరైనా గ్రామంలోకి వస్తే 5,000 రూపాయలు జరిమానా విధించాలని గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లా బట్రౌచా గ్రామ పెద్ద జష్వీర్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. లాక్ డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు బట్రౌచా గ్రామంలో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. 
 
ఎవరైనా కొత్తవాళ్లు వస్తే ముందుగా గ్రామ పెద్దకు సమాచారం అందించి ఆ తరువాత అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. దేశంలో కరోనా బాధితులతో పాటు మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 292 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యరు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందో చూడాల్సి ఉంది. ఏపీలో కొద్దిసేపటి క్రితం వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా బాధితుల సంఖ్య 303కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఒకరిద్దరూ మినహా మిగిలిన వారందరికీ ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: