ఒకవైపు కరోనావైరస్ సమస్య. మరోవైపు రైంతాంగ అవసరాలను చూసుకోవాలి. అదే సమయంలో పేదలు, మధ్య తరగతి వాళ్ళ అవసరాలేంటో కనిపెట్టుకునుండాలి. ఇందుకోసమని ప్రభుత్వ యంత్రాంగాన్నంతా గ్రిప్ లో పెట్టుకుని అవసరమైన చోట్లకు మళ్ళిస్తుండాలి. ఏక కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవకాశం ఉన్నంతలో బాగానే చేస్తోంది. అయినా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాత్రం ఏపిలో ప్రభుత్వం సక్రమంగా పనిచేయటం లేదని హైదరాబాద్ లో కూర్చుని ఆరోపణలు, విమర్శలు ఎందుకు చేస్తున్నట్లు ప్రతిరోజు ?

 

ఎందుకంటే ప్రధానంగా మూడు కారణాలున్నాయి. మొదటిదేమో జనాలు తనను ఎక్కడ మరచిపోతారో అనే భయం. ఎందుకంటే చంద్రబాబుకున్నంత ప్రచారం పిచ్చి మరెవరికీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం బాగా చేస్తోందని చెప్పలేడు. అలాగనే ఏదో చేస్తోంది చేయనీలే అని సరిపెట్టుకుని ఊరికే కూర్చోలేడు. అందుకనే ప్రభుత్వం ఫెయిలైందంటూ ప్రతిరోజు ఒకటే గోల పెడుతున్నాడు.

 

రెండో సమస్య ఏమిటంటే జగన్ ప్రభుత్వం సంక్షోభ సమయాన్ని బాగానే ఎదుర్కొంటోందన్న విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. అయితే జగన్ పై నరనరాన నిండిపోయిన ధ్వేషం ఆ విషయాన్ని ఒప్పుకోనీయటం లేదు. పైగా తానే ప్రభుత్వం బాగా పనిచేస్తోందని స్వయంగా మెచ్చుకుంటే టిడిపికి ఇక భవిష్యత్తుండదనే భయం. ఇప్పటికే పార్టీ పరిస్దితి గాలిలో దీపం లాగ తయారైంది. తెలంగాణాలో అయితే దాదాపు ఆరిపోయినట్లే అనుకోవాల్లేండి.

 

ఇక చివరి కారణం ఏమిటంటే ఒకవేళ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఊరికే ఉన్నా ఆయన మద్దతు మీడియా మాత్రం ఊరుకోనీయటం లేదు. జగన్ –చంద్రబాబు మధ్య పడటం లేదంటే అర్ధముంది. మరి మీడియా అధిపతులకు ఏమొచ్చింది ? అందుకనే లేనివి, జరగనివి లేకపోతే చిన్న ఘటననైనా భూతద్దంలో చూపించి జగన్ పై బురద చల్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి యజమాన్యాలు. బహుశా మీడియా యాజమాన్యాల కోసమో లేకపోతే పార్టీ భవిష్యత్తు మీద భయంతోనో జగన్ మీద చంద్రబాబు ప్రతిరోజు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: