దేశంలో కరోనా తో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అయితే భారత దేశంలో కరోనా ప్రభావం ఇతర దేశాలతో పోల్చితే పెద్దగా లేదని.. మన సాంప్రదాయలు, కట్టు బాట్లు ఈ కరోనా వ్యాప్తిని అరికట్టుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరోనాపై పై మనం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాం.  దేశంలో 4314 మందికి కరోనా.. దేశ జనాబాతో పోల్చితే మన పోరాటం గొప్పదని దీన్ని బట్టే అర్థం అవుతుంది.   కేంద్రం నుంచి వచ్చిన సూచనలు, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని కోరుతున్నాను అన్నారు.  

 

25937 మందని ఇప్పటి వరకు క్వారంటైన్ చేశామని అన్నారు.  వీళ్లలో విదేశాల నుంచి వచ్చింది 30 మంది, వాళ్ల కుటుంబ సభ్యులు20 మంది ఇక 35 మంది ఇప్పటి వరకు డిశ్చార్ అయ్యారు. మరో 15 మంది ఏప్రిల్ 8న డిశ్చార్జ్ అవుతారని అన్నారు.  258 మందిని క్వారంటైన్ నుంచి రేపు విడుదల చేస్తామన్నారు. నిజాముద్దీన్ ఘటన కారణంగా రాష్ట్రంలో ఇప్పటికి 364 మందికి పాజిటీవ్ అని తేలింది. మొత్తంగా రాష్ట్రంలో 45 మంది డిశ్చార్జ్ అవ్వగా 11 మంది చనిపోయారు.  

 

కరోనా మన దేశంలో పుట్టింది కాదు.. మన దేశం లో ఉన్నా పరిస్థితులకు ఇది పెద్దగా ప్రబావం చూపించదన్న విషయాన్ని గమనించాలి అన్నారు.  కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కరోనా నియంత్రణ లో మన దేశం, రాష్ట్ర విజయం సాధించినట్టే చెప్పొచ్చు.  భారత దేశ పద్దతులు ప్రపంచం మెచ్చుకుంటున్నారు.  ఇతర దేశాలతో పోలిస్తే మనం చాలా మెరుగ్గా ఉన్నాం అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: