ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసిఆర్ మాట్లాడుతూ కరోనాను నియంత్రించేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అధ్బుతమైన విజయం సాధించామని కేసీఆర్ అన్నారు. అంతే కాకుండా కరోనా కట్టడికి చేపట్టాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నామని కేసిఆర్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా కేంద్రం చెప్పిన అన్ని సూచనలు పాటిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని తెలంగాణా సిఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

అమెరికాలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. అమెరికా లాంటి దేశంలో శవాల గుట్టలు ఉన్నాయని కేసిఆర్ అన్నారు. అయితే ఈ కరోనా వైరస్ అనేది మన దేశంలో పుట్టినది కాదని ఆయన గుర్తచేశారు. ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్న 25 వేల మందిలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అని కేసీఆర్ అన్నారు. బాధితులు అందరూ క్షేమంగా ఉన్నారని, వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 364 మందికి కరోనా సోకింది అన్నారు. బాధితులు అందరూ క్షేమంగానే ఉన్నారని ఆయన తెలిపారు. 

 

గాంధీ ఆస్పత్రిలో 3౦8 మందికి కరోనా చికిత్స పొందుతున్నారు అని తెలిపారు. సకాలంలో స్పందించి ట్రీట్మెంట్ కి వచ్చిన వారు అందరికి చికిత్స అందిస్తున్నామని వారు అందరూ క్షేమంగా ఉన్నారని సీఎం కేసిఆర్ అన్నారు. క్వారంటైన్ గడువు ముగిసిన వాళ్ళు ఇళ్ళకు వెళ్లిపోతారని చెప్పుకొచ్చారు. క్వారంటైన్ లో ఉన్న 50 మందికి కరోనా సోకిన  వాళ్ళల్లో ఉన్న 30 మంది విదేశాల నుంచి వచ్చారని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 1089 మందిని గుర్తించామని, క్వారంటైన్ నుంచి రేపు 258 మంది వెళ్లిపోతారని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 1089 మందిలో  172 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: