ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ప్రజలు కరోనా పేరు వింటే చాలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మొన్నటివరకు జిల్లాపై కరోనా ప్రభావం పెద్దగా లేదు. కానీ నిన్నటినుండి పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఒక్కరోజే జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 74కు చేరింది. 
 
రాష్ట్రంలో ఈ రోజు కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా కర్నూల్ లో 18, నెల్లూరు లో 8, పశ్చిమ గోదావరి లో 5, కడప లో 4, కృష్ణ మరియు ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.కొత్తగా నమోదైన 37 కేసులతో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 303 కి పెరిగింది. కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 
 
ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తోంది. కొన్ని ప్రాంతాలలో 48 గంటల పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచనలు చేయటంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్నటివరకు రాష్ట్రంలో 334 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాత్రి వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదలైన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: