కరోనా దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. రోజు రోజుకి దేశంలో కరోనా కేసుల సంఖ్య  పెరిగిపోతోంది.  ప్రతి ఒక్కరిలో కరోనా భయం మొదలయింది. దీనితో ఇప్పుడు ప్రతి ఒక్కరు నోటికి మాస్క్ లు ధరిస్తున్నారు. దీనితో  ప్రపంచంలో మాస్కుల కొరత అనేది ఎక్కువ అయింది. అలాగే మాస్క్ లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఐదు రూపాయలకి ఒక మాస్క్ అమ్మితే ఇప్పుడు అది ఏకంగా 35 రూపాయిలు అయింది 50 రూపాయలకు అమ్మిన ఆశ్చర్యం లేదు. అయితే ఈ మాస్క్ లను ఎవ‌రైనా ఇండ్ల‌లోనే త‌యారు చేసుకోవ‌చ్చు.

 

 

  ఎవరికీ వారు స్వ‌యం ఉపాధిని కూడా పొంద‌వ‌చ్చు. అయితే ఈ కష్టం కాలంలోనే కాకుండా  ఎప్పుడైనా స‌రే.. స‌ర్జిక‌ల్ మాస్కుల‌కు మంచి గిరాకీ ఉంటుంది. త‌క్కువ పెట్టుబ‌డితోనే నెల‌కు రూ.వేలల్లో సంపాదించ‌వచ్చు.ప్ర‌స్తుతం మార్కెట్‌లో రెండు ర‌కాల మాస్కులు వినియోగిస్తున్నారు. మనం ఈ మాస్కులని ఇండ్ల‌లోనే త‌యారు చేసి అమ్ముకోవచ్చు.  వాటిల్లో ఒక‌టి స‌ర్జిక‌ల్ త‌ర‌హా మాస్క్‌.. రెండోది.. ఇండ‌స్ట్రియ‌ల్ గ్రేడ్ మాస్క్‌.. ఇవి రెండూ మ‌న‌కు ప్రొటెక్ష‌న్‌ను ఇస్తాయి. క్లాత్‌, ఎలాస్టిక్‌, క‌రెంటు ఖ‌ర్చు త‌దిత‌రాల‌ను క‌లిపితే ఒక్కో స‌ర్జిక‌ల్ మాస్క్ త‌యారీకి దాదాపుగా రూ.1.50 ఖర్చు  అవుతుంది. అదే ఇండ‌స్ట్రియ‌ల్ గ్రేడ్ మాస్క్ అయితే.. ఒక్కోదానికి దాదాపుగా రూ.3 వ‌ర‌కు అవుతుంది. ఈ క్ర‌మంలో నిత్యం ఎవ‌రైనా.. 10 గంట‌ల పాటు ప‌నిచేస్తే  ఎలా లేదన్న 200 మాస్కుల దాక కుట్టవచ్చు.

 

ఇలా రోజుకు 200 స‌ర్జిక‌ల్ మాస్క్‌ల‌ను కుడితే.. ఖ‌ర్చు 200 * 1.50 = 300 అవుతుంది. ఇక వాటిని బ‌య‌ట రూ.10కి 1 చొప్పున అమ్మినా స‌రే.. 200 * 10 = 2000 అవుతుంది. అందులోంచి ఖ‌ర్చు రూ.300 తీసేస్తే.. 2000-300 = రూ.1700 అవుతుంది. ఇలా ఈనెల‌కు 30 * 1700 = రూ.51వేలు సంపాదించ‌వ‌చ్చు. ఇండ‌స్ట్రియ‌ల్ గ్రేడ్ మాస్క్‌ల‌కు అయితే.. 200 * 3 = రూ.600 రోజూ ఖ‌ర్చ‌వుతుంది. వీటిని మార్కెట్‌లో రూ.30 వ‌రకు విక్ర‌యిస్తున్నారు. దీంతో 200 * 30 = రూ.6000 అవుతుంది. ఇందులోంచి ఖ‌ర్చు రూ.600 తీసేస్తే.. రూ.6000 – రూ.600 = రూ.5400 అవుతుంది. అదే నెల‌కు 30 * 5400 = రూ.1,62,000దాక లాభం పొందవచ్చు.

 

 

అయితే ఇప్పుడు  క‌రోనా కారణంగా ఈ మాస్క్‌ల‌ను రిటెయిల్‌గా ఈ ధ‌రకు విక్ర‌యిస్తున్నారు. కాని తర్వాత   ధర  అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే  హాస్పిట‌ళ్లు, ఇండ‌స్ట్రీల‌కు ఈ మాస్కుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తే.. వారికి హోల్‌సేల్‌గా అమ్మాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆదాయంలో స‌గం వ‌ర‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. సగం ఆదాయం వచ్చిన గాని, పెద్ద కష్టం అనేది ఉండదు. అందులోను పెట్టుబడి కూడా తక్కువతోనే అయిపోతుంది.. ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఉన్నవాళ్లు కుట్టడం మొదలుపెట్టండి మరి... !!

మరింత సమాచారం తెలుసుకోండి: