ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తుంది కరోనా. ఈ వైరస్ కి ముందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావడంతో ప్రపంచంలో చాలా వరకు దేశాలు అన్ని లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో ఈ కరుణ వేరే దెబ్బకు చాలా దేశాలలో ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఎక్కువగా రాబోయే రోజుల్లో మనుషులు ఆకలి వల్ల చనిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలను ఆదుకోవడానికి చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశ స్థాయిలో పారిశ్రామికంగా బాగా ఎదిగిన ధనవంతులు కొన్ని కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తూ ఉండగా సెలబ్రిటీ లు మరియు రాజకీయ నాయకులు వారికి తోచిన విధంగా ఒకపక్క ప్రభుత్వానికి విరాళాలు ఇస్తూనే మరోపక్క తమ చుట్టుప్రక్కల ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్న వార్తలు ఇటీవల మనం వింటూనే ఉన్నాం.

 

ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణలో మంత్రి పువ్వాడ అజయ్ విరాళాల విషయంలో సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా రికార్డు సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ బాధితులను ఆదుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఉన్న చాలా మంది వ్యాపారులు విద్యా సంస్థలకు చెందిన వాళ్ళు విరాళాలు ఇవ్వటం తో అవి దాదాపు కోటి 75 లక్షల అయ్యాయట.

 

కాగా మంత్రి తన విద్యా సంస్థల తరపున 25 లక్షలు దానికి యాడ్ చేసి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి..ఏదో తానే రెండు కోట్లు ఇచ్చినట్లుగా ఇటీవల వ్యవహరించడం జరిగిందట. దీంతో చాలా మంది సొమ్ము తన సొమ్ము గా ఇతరులకు కలరింగ్ ఇచ్చి మంత్రి పువ్వాడ అజయ్ తెలంగాణ బాస్ కెసిఆర్ ముందు సరికొత్త ఇమేజ్ సంపాదించుకున్న ట్లు తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్ అని అంటున్నారు చాలామంది రాజకీయ  నాయకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: