తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్‌ను కట్ట‌డి చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దేశంలోనే క‌రోనా క‌ట్ట‌డిలో కేసీఆర్ తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీతో పాటు ప్ర‌తి ఒక్క‌రు అభినందిస్తున్నారు. ప్ర‌తి రెండు మూడు రోజుల‌కు ప్రెస్‌మీట్లు పెడుతూ కేసీఆర్ తెలంగాణ స‌మాజాన్ని.. అటు అధికారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చాలా దేశాల్లో సామూహిక మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయ‌ని.. వీటిని త‌ల‌చుకుంటూనే దుఖః మొస్త‌ద‌ని కేసీఆర్ చెప్పారు.

 

అగ్ర రాజ్య‌మైన అమెరికాలో శ‌వాలు గుట్ట‌లు గుట్ట‌లుగా ఉన్నాయ‌ని.. క‌నీసం వారిని ప‌ట్టించుకునేందుకు బంధువులు. స్నేహితులు కూడా రాలేని ప‌రిస్థితి ఉంద‌న్నారు. ఇక తెలంగాణ‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఓ వ్యక్తిని ఆదిలాబాద్ నుంచి ప్రాణాలు కాపాడేందుకు నాకు ఫోన్ చేసి హైద‌రాబాద్‌కు పంపే టైంలోనే ప్రాణాలు కోల్పోయార‌ని.. అప్ప‌టికే అత‌డిలో వైర‌స్ ఎక్కువ అయ్యింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక తెలంగాణ‌లా ఇద్ద‌రు ముగ్గురు వ్య‌క్తుల ప్రాణాలు తాము కాపాడ‌లేక‌పోయామ‌ని అప్ప‌టికే వారిలో వైర‌స్ ఎక్కువైంద‌ని కేసీఆర్ చెప్పారు.

 

ఇక హైద‌రాబాద్‌లో ఓ మ‌హిళ క‌రోనాతో చ‌నిపోయింద‌ని.. ఆమె న‌లుగురు పిల్ల‌లు అనాథ‌లు అయ్యార‌ని. ఈ వార్త తాను పేప‌ర్లో చ‌దివి.. ఆ పిల్ల‌లు అనాథ‌లు అవ్వ‌డానిక వీలులేద‌ని త‌మ నాయ‌కుల‌కు చెప్పాన‌ని చెప్పారు. ఏదేమైనా కేసీఆర్ క‌రోనా విష‌యంలో జగ్రత్తగా ఉండకపోతే ప‌రిస్థితులు తీవ్ర‌మ‌వుతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: