ప్రపంచంలో ప్రతి దేశ ప్రధాని భయపడుతున్న పేరు ఏదైనా ఉందంటే అది కరోనా వైరస్. గతంలో ఉగ్రవాదులు గురించి అదేవిధంగా కరువు గురించి దేశ ప్రధానులు ప్రపంచంలో భయపడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది మొట్టమొదటిసారిగా ఒక వైరస్ గురించి ప్రపంచమంతా వణికిపోతోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని దేశాలలో వ్యాపించి ఉంది. ఎక్కువగా అగ్రరాజ్యం అమెరికా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావటంతో చాలా దేశాలు లాక్ డౌన్ అమలులోకి తీసుకు రావడం జరిగింది. దీంతో చాలా దేశాలలో ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతింది.

 

ఇండియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏవిధంగా ఉంటే ఇండియా లో ఈ వైరస్ వల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని అంతర్జాతీయ స్థాయిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ప్రయోగాలు చేస్తున్న వారు అంటున్నారు. కంగారు పడకుండా భారతీయులు కూర్చుని ఆలోచిస్తే ఇది చాలా చిన్న విషయమని వాళ్లకి అంటున్నారు. పూర్తి మేటర్ లోకి వెళితే టీబీ (క్షమ) నివారణకు ముందు నుండి భారత ప్రభుత్వం పుట్టిన ప్రతి ఒక్కరికి  బీసీజీ టీకాలు వెయ్యాలని రూల్ ఉంది.

 

దీంతో ఇప్పుడు బీసీజీ టీకాలు వేసుకున్న వారికి ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ అని ప్రస్తుతం వైరస్ కోసం చేస్తున్న ప్రయోగాలలో బీసీజీ వ్యాక్సిన్ కరోనాతో పోరాడుతుందుంటూ ఇంటర్నేషనల్ శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. సో భారతీయులు కరోనా వైరస్ గురించి భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: