కరోనా భయంతో ఇప్పుడు అమెరికా లాంటి దేశమే భయపడుతుంది.  న్యూయార్క్ లో శవాల గుట్టలు లేస్తున్నాయి.. విదేశాల నుంచి వచ్చిన 25 వ మందిని క్వారంటైన్ లో ఉంచామని అన్నారు. వీరిలో 50 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది.. ఇందులో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారు.. 20 మంది కుటుంబ సభ్యులకు వచ్చింది. నిజాముద్దీన్ సంఘటన దేశాన్ని అతలా కుతలం చేసిందని అన్నారు.  తెలంగాణ మొత్తం 364 మందికి కరోనా సోకింది. 364 మంది లో  45 మంది డిశ్చార్జ్ అయ్యారు.  వారిలో 11 మంది చనిపోయారు.  

 

గాంధీ లో 308 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారని అన్నారు.  1089 మంది నిజాముద్దీన్ కి వెళ్లొచ్చారు.  వారిలో 170 మందికి వైరస్ సోకింది. 170 మంది 93 మందికి కరోనా అంటించారు. కరోనా రెండు భాగాలుగా చెప్పుకోవొచ్చు. వ్యాధి ప్రబలడం త్వర్వాత కేంద్రం చెప్పిన ప్రతి సూచనలు పాటిస్తూ వచ్చామని అన్నారు.  జనతా కర్ప్యూ, లాక్ డౌన్ చేస్తూ ముందుకు వెళ్లాం.  బతికి ఉంటే కలోగంజోతాగుదాం.. ప్రధానితోనూ లాక్ డౌన్ పై తీవ్ర చర్చ సాగుతుందని అన్నారు.

 

వెంటిలేటర్ వరకు కూడా వెళ్లకుండానే బాధితులు చనిపోతున్నారు. వైరస్ బాగా పెరిగిపోతే చికిల్స కూడా కష్టమే. మనుషులు చనిపోకుండా చూడాల్సిన బాద్యత మనది అన్నారు. భారతీయ సాంప్రదాయాలు మనల్ని ఇప్పటి వరకు పెద్ద ప్రమాదాం నుంచి బతికిస్తున్నాయి.  కొన్ని దేశాల పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందని అన్నారు. అంతర్జాతీయ మీడియా సైతం భారత్ ను కొనియాడుతోందని, అనేక రాష్ట్రాలు, అనేక ప్రభుత్వాలు ఉన్నా భారత్ ఒక్కతాటిపై నిలిచిందని పాశ్చాత్య మీడియా సంస్థలు కొనియాడాయని తెలిపారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: