అగ్రరాజ్యం అమెరికా దేశాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల అమెరికా ఆర్థికంగా చాలా వరకు నష్టపోయింది. ముఖ్యంగా వైరస్ ప్రభావం న్యూయార్క్ లో ఎక్కువగా ఉండటంతో...ఇతర ఎమర్జెన్సీ కేసులు ఏమీ చూడకుండా కేవలం వైద్యులు అక్కడ కరుణ పాజిటివ్ కేసులనే టేకప్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అమెరికా ప్రభుత్వం న్యూయార్క్ లో లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రాంతంలో ప్రజలంతా ఉద్యోగాలకు వెళ్లలేక ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ దెబ్బకి నగర వాసులకు చేతిలో పని లేకుండా పోయింది. ఈ పరిణామంతో చాలామంది న్యూయార్క్ నగర వాసులు అద్దెలు మరియు టాక్స్ లు, వాటర్ బిల్లులు, కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో న్యూయార్క్ నగరంలో 18 అపార్ట్మెంట్ లకు ఓనర్ అయిన మారియో దాదాపు 300 మందికి ఇళ్లు అద్దెకు ఇవ్వడం జరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో కష్టాలు సమస్యలను అర్థం చేసుకున్న మారియో...తన అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న 300 మందిని ఏప్రిల్ నెలకు సంబంధించి అదే చెల్లించనవసరం లేదని తెలిపాడు. దీంతో ఓనర్ మారియో తీసుకున్న నిర్ణయానికి ఎంతోమంది ఆనందం వ్యక్తం చేశారు.

 

ఇలాంటి దారుణమైన ఈ పరిస్థితుల్లో అద్దె డబ్బులు తనకు ముఖ్యం కాదన్న మారియో... ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమన్నారు. దీంతో మారియో పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఇతన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచం లో కరోనా పెద్ద సమస్యే కాదు అని కామెంట్ చేస్తున్నారు. మనుషులంతా పోరాడుతున్న ఈ వైరస్ గురించి మిగతా మనుషులు కూడా మారియో విధంగానే ఆలోచించాలని మరికొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: