లాక్‌డౌన్‌ను మ‌రికొంత‌కాలం పొడ‌గించ‌డ‌మే క‌రోనా మ‌హ‌మ్మారికి మ‌న‌క‌నుగొనే మంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువు క‌రోనా మ‌నావాళిని ప‌ట్టిపీడిస్తోంద‌ని అన్నారు. అయితే లాక్‌డౌన్ ఇప్ప‌ట్లో ఎత్తివేస్తే మాత్రం మ‌ళ్లీ వైర‌స్ విజృంభించే అవ‌కాశాలు మెండుగా ఉన్న‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్‌లో ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో జ‌రిగిన స‌మీక్ష అనంత‌రం ఆయ‌న విలేఖ‌రుల‌తో మాట్లాడారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న లాక్‌డౌన్‌పై కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనాను ఎదుర్కొవ‌డానికి  మాన‌వాళి ద‌గ్గ‌ర ఎలాంటి ఆయుధాల్లేవు.. మ‌న‌కు ఉన్న ఆప్ష‌న్ ఒక్క‌టే లాక్‌డౌన్ పాటించి వైర‌స్ లింక్ క‌ట్ చేయ‌డ‌మేన‌ని తెలిపారు.

 

‘‘బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే అమెరికా సంస్థ సర్వే.. జూన్ 3 వరకు భారత్‌లో లాక్‌డౌన్ కొనసాగించాలని సూచించింది. ప్రజలను కాపాడుకోవడానికి మన లాంటి దేశానికి లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదు. బతికుంటే బలుసాకు తింటాం. లాక్‌డౌన్‌ వల్ల భారత సమాజాన్ని బతికించుకున్నాం. క్రమశిక్షణ పాటించడం వల్లే ఇలా ఉన్నాం. న్యూయార్‌లో శవాల గుట్ట ఫొటోలు చూడలేకపోతున్నాం. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు. యుద్ధం లేకున్నా.. కనిపించని శత్రువు వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. అమెరికాలోనే ఇలా ఉంటే.. మన దగ్గర పరిస్థితిని ఊహించుకోలేం’’ అని కేసీఆర్ వ్యాఖ్య‌నించారు..

 

 వైర‌స్ సోకిన వారిని గుర్తించ‌డం అంత ఈజీ కాద‌ని తెలిపారు. మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌కు సంబంధించిన వారి వివ‌రాలు క‌నుగొన‌డం, వారు రాష్ట్రానికి తిరిగి వ‌చ్చాకా ఎక్క‌డెక్క‌డ తిరిగారు..వారి వ‌ల్ల ఇంకెత‌మందికి వైర‌స్ సోకింది అనే విష‌యాల‌ను క‌నుగోనే ప‌నిలో అధికారులు, వైద్యులు ఉన్నార‌ని అన్నారు. అయితే అనుకున్నంత తేలిక ఈ ప‌ని కాద‌ని స్ప‌ష్టం చేశారు. అదుపులోకి వ‌చ్చింద‌ని నేను స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితుల్లోనే నేను ప్ర‌ధాన‌మంత్రి మోదీ గారికి ఒక్క‌టే విజ్ఞ‌ప్తి చేస్తున్నా లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని కోరుతున్నా. నా అభిప్రాయం కొంత‌మందికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు..కానీ ఎవ‌రికి అన్యాయం చేయాల‌ని ఈ మాట‌లు చెప్పట్లేదు. స‌మాజం బాగుండాల‌ని కోరుకుంటున్నా. ఇక కేసీఆర్ సూచ‌న‌ల‌ను మోదీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది..అయితే మోదీ కూడా కేసీఆర్ నిర్ణ‌యాన్నే రెండు రోజుల త‌ర్వాత ప్ర‌క‌టించ‌వ‌చ్చ‌న్న అభిప్రాయాన్ని నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: