కరోనా వైరస్...ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. దీనికి మెడిసిన్ లేకపోవడంతో, ఎక్కువ సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రపంచం మొత్తంలో 13 లక్షలకు మందికి పైనే ఈ వైరస్ సోకింది. అయితే ఈ కరోనా వ్యాప్తిపై పలు రకాల అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది వైద్య నిపుణులు ఈ కరోనా వ్యాప్తిపై పలు సూచనలు కూడా చేశారు.

 

ఈ క్రమంలోనే కరోనా స్త్రీలకంటే పురుషుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని తేలింది. దీని మీద ఖచ్చితమైన నిర్ధారణ లేకపోయిన, ప్రస్తుతం పరిస్థితులని చూస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎక్కువ శాతం పురుషులే ఈ కరోనా బారిన పడటం, మరణించడం జరుగుతుంది. అయితే కరోనా వల్ల స్త్రీలకంటే పురుషులు ఎక్కువ మరణించడానికి పలు కారణాలు చెబుతున్నారు. స్త్రీల మీద పోలిస్తే పురుషుల జీవన శైలి సరిగా లేకపోవడం, మద్యం, పోగత్రాగటం, చేతులు కడుక్కునే అలవాటు తక్కువ ఉండటం వల్ల పురుషులు కరోనా వల్ల ఎక్కువ మరణిస్తున్నారు.

 

ముఖ్యంగా స్త్రీలకంటే పురుషులకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి, కరోనా వస్తే పురుషుడుకే ఎక్కువ చనిపోయే అవకాశాలున్నాయి. అలాగే  కరోనా వ్యాప్తి కూడా స్త్రీలకంటే పురుషులకు ఎక్కువ ఉండటానికి కూడా ఓ సాధారణ కారణముంది. స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువ బయట తిరుగుతారు. దాంతో వారికి కరోనా వచ్చే అవకాశాలున్నాయి.

 

ఇప్పటివరకు చూసుకుంటే అలాంటి సాధారణ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనదేశంలో  విదేశాల నుంచి వచ్చినవారిలో కరోనా సోకింది ఎక్కువ పురుషలకే. అలాగే ఇటీవల ఢిల్లీలోని మర్కజ్ ప్రార్ధనలకు వెళ్ళి కరోనాకు గురైన వారంతా పురుషులే. అయితే ఆ ప్రార్ధనలకు స్త్రీలు ఎలాగో వెళ్లారు. మొత్తానికైతే ఈ కరోనా వల్ల పురుషులకే ఎక్కువ ముప్పు ఉందని అర్ధమవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: