గత రెండు రోజులతో పోలిస్తే ఈ రోజు తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో తెలంగాణ లో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 364 చేరింది. అందులో 45 మంది కోలుకోగా 11మంది మరణించారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  
 
 
ఇదిలా ఉంటే కరోనా పై కొద్ది సేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టిన  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్  కొనసాగించాలని పేర్కొన్నారు. కరోనా ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని అందువల్ల మరో వారం లేదా రెండు వారాల పాటు  లాక్ డౌన్ ను కొనసాగిస్తే మంచిదని కేసీఆర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి సూచించారు. కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతున్నట్లు  వార్తలు వస్తున్నాయి. మరో రెండు ,మూడు రోజుల్లో లాక్ డౌన్ పొడిగింపు పై స్పష్టత వచ్చే అవకాశాలు వున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 4500 దాటింది. అందులో 100కిపైగా మరణించారు. మిగితా దేశాలతో పోలిస్తే కరోనా విషయంలో ఇండియా మెరుగైన స్థితిలోనే వుంది. 
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈక్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: